మూత్రపిండాల్లో రాళ్లు


Wed,July 27, 2016 01:18 AM

మూత్రపిండాలు రక్తంలోని విషపదార్థాలను, మలిన పదార్థాలను వడపోసి శరీర సమతుల్యతను కాపాడుతాయి. ఆమ్ల, క్షార సంబంధం చక్కగా ఉండేలా చూస్తాయి.
కిడ్నీ స్టోన్స్ 30 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లలో ఏర్పడతాయి. మహిళల్లో కన్నా మగవారిలో ఎక్కువ. రక్తంలో కాల్షియం ఆక్సలేట్స్, యూరిక్ ఆసిడ్, సిస్టీన్ వంటి పదార్థాలు బయటకు విడుదల అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అవి ఒకచోట పేరుకుపోతుంటాయి. ఇవే రాళ్ల రూపంలోకి మారుతాయి.
కొన్ని రకాల మందులు (మెగ్నీషియం) వలన కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాల్షియం ఎక్కువగా పాలు, పాలకు సంబంధించిన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నా (రీనల్ ట్యూబులార్ అసిడోసిస్), ఎముకలకు సంబంధించిన సమస్యలు (పెజెట్స్ వ్యాధి) ఉన్నవారు, హైపర్ విటమిన్-డి కలవారికి, హైపర్‌థైరాయిడిజమ్ వల్ల ఎక్కువగా కదలలేని స్థితిలో ఉన్న రోగులకు కాల్షియం ఎక్కువగా డిపాజిట్ అవుతుంది.
ఆక్సలేట్స్ ఎక్కువగా క్యాబేజీ, టమాటా, పాలకూర, బ్లాక్‌టీలలో ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోవడం మానేయాలి. గౌట్ సమస్య ఉన్నవారిలో యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.
homeopathy

లక్షణాలు
నొప్పి : కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పి ఎక్కువగా ఉండదు గానీ మూత్రాశయంలో ఉంటే మాత్రం తీవ్రమైన నొప్పి ఉంటుంది. నొప్పి వీపు భాగం నుంచి ప్రారంభమై ముందుకు పొట్ట ద్వారా గజ్జల్లోకి వ్యాపిస్తుంది. ఒక్కోసారి ఈ నొప్పి వృషణాల వరకు వస్తుంది. దీనితో పాటు చెమట పట్టడం, వికారం, వాంతి లక్షణాలు కూడా ఉంటాయి.
సాధారణంగా కిడ్నీలో రాళ్లు చిన్న పరిమాణంలో ఉంటే అవి మూత్ర మార్గం గుండా పడిపోతూ ఉంటాయి.
మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం, అవి ఉండే స్థలాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి.
హైడ్రోనెఫ్రోసిస్ : కిడ్నీలో వాపు రావడాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు.
హిమచూరియా : ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. దీన్ని హిమచూరియా అంటారు.
కొన్ని రకాల రాళ్లు అంటే ఫాస్ఫేట్ సంబంధించిన రాళ్లు ఉన్నా కూడా బయటకు లక్షణాలు కనబడవు. అవి ఆకస్మికంగా ఎక్స్‌రే తీసుకోవడం వలన తెలుస్తుంది.
పరీక్షలు
రక్తపరీక్షలు - సీబీపీ, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటినిన్
మూత్రపరీక్ష - సీయూఈ
రేడియోగ్రఫీ - కేయూబీ కి స్ట్రెయిట్ ఎక్స్‌రే, అల్ట్రాసోనోగ్రఫీ, కంప్యూటర్ టోమోగ్రఫీ, రీనల్‌స్కాన్ వంటి అధునాతన పరీక్షల ద్వారా రాళ్ల పరిమాణం, నిర్మాణం, పదార్థం అన్నీ తెలుసుకుంటారు.
జాగ్రత్తలు
కాల్షియం, ఆక్సలేట్ సంబంధించిన పదార్థాలను తీసుకోకూడదు.
రోజూ తగినన్ని నీటిని తీసుకోవాలి. అంటే 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
ప్రొటీన్లను తగ్గించాలి.
విటమిన్ డి తీసుకోవడం తగ్గించాలి.
చికిత్స
హోమియోవైద్యంలో మానసిక, శారీరక లక్షణాలను బట్టి ఔషధాన్ని వాడుతారు. దీనివల్ల డిపాజిట్ అయ్యే తత్వం మారిపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేట్లు చేయవచ్చు. అప్పటికే ఏర్పడి ఉన్న రాళ్లను కూడా లేకుండా చేయవచ్చు.
srikanth

3460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles