మూగజీవాల కోసం జాగృతి


Mon,June 19, 2017 01:04 AM

సమాచారమివ్వు, స్ఫూర్తినివ్వు, భాగమవ్వు. ఈ మూడింటికీ ఒక అవినాభావ సంబంధం ఉన్నది. అదేంటో తెలియాలంటే ఢిల్లీకి వెళ్లాలి. ఈ మూడు అంశాలే ప్రధానంగా ఏర్పాటైన జాగృతి సంస్థని అడుగాలి.
jagruthi
జంతు ప్రేమికురాలు వసుధ మెహతా సోదరుడు వివేక్‌తో కలిసి వీధికుక్కల సంరక్షణ కోసం ఒక సంస్థను ప్రారంభించారు. నగరంలో వీధికుక్కలు ఎక్కడ గాయపడినా సమాచారం అందిస్తే చాలు.. వెంటనే ప్రథమ చికిత్స అందేలా చూస్తున్నదీ సంస్థ. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ వేల సంఖ్యలో మూగజీవాలకు ప్రాణం పోసింది. పారా వెటర్నరీ వైద్యులు, శిక్షణ పొందిన వెటర్నరీ ఫార్మసిస్టులతో కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి మూగజీవాల సేవను కొనసాగిస్తున్నది. 2004లో పీజీ పూర్తిచేసిన వసుధ మూగజీవాల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థతో కలిసి చేయడం ప్రారంభించారు. అందులో మంచీచెడులను తెలుసుకున్న ఆమె సమాచారమివ్వు, స్ఫూర్తినివ్వు, భాగమవ్వు అనే నినాదంతో జాగృతిని స్థాపించారు. గాయాలతో మూగజీవాలు ఎక్కడ కనిపించినా సమాచారమివ్వండి. నలుగురికి స్ఫూర్తినివ్వండి. మూగప్రాణుల సేవలో భాగమవ్వండి. ఇదే జాగృతి ముఖ్య ఉద్దేశం.

329
Tags

More News

VIRAL NEWS