ముడి ఆహారమే ముద్దు!


Mon,September 3, 2018 11:57 PM

Nutrition-Week
మీరు రోజూ ఎలాంటి ఆహారం తింటున్నారు? బాగా వండిన.. వేయించిన.. స్పైసీ ఆహారమే అయితే కాస్త తగ్గించండి అంటున్నారు నిపుణులు. జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా ముడి ఆహారం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

ఎంత తిన్నామన్నది కాదు.. ఏం తిన్నామన్నది ముఖ్యం అని పిలుపునిచ్చింది నేషనల్ న్యూట్రిషన్ వీక్-2018. ఈ సందర్భంగా కొన్ని గైడ్‌లైన్స్ ప్రకటించింది. తాజాగా లభించే ఆహారం, పండ్లు, కాయలను బాగా ఉడికించి తినడం మానేయాలంటున్నారు. ఎందుకంటే ఇవి 104-118 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు ఉడకడం వల్ల తాజా ఆహారంలో ఉన్నవన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలా కాకుండా నేరుగా పోషకాలు అందాలంటే ముడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. నట్స్, సీడ్స్, వంటివి మొలకెత్తించి తీసుకోవాలి. గుడ్లు వంటివి మాత్రం ఉడికించి తీసుకోవడమే బెటర్. ఎందుకంటే పచ్చి గుడ్లను తింటే వాటిలోని సాల్మోనెల్లా వల్ల అనారోగ్యం పాలవుతారు.

91
Tags

More News

VIRAL NEWS