ముఖంపై బొడిపెలా?


Fri,August 24, 2018 01:03 AM

Bodepelu
-ముఖంపై బొడిపెలు ఉన్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు. బలవంతంగా చిదమకూడదు. ముఖం కడుక్కునేటప్పుడు గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా నెమ్మదిగా శుభ్రం చేయాలి.
-తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగైదు సార్లు నిమ్మరసాన్ని బొడిపెల మీద రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
-రెండు టీ స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖం కడగాలి. లేదా ఆ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు బొడిపెపై రాయాలి. ఇలా చేస్తే త్వరలోనే నయం అవుతుంది.
-కోడి గుడ్డుతెల్ల సొనను బొడిపె మీద రాసి, ఆరిన తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
-ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనెలో అర టీ స్పూన్ దాల్చినచెక్క పొడిని వేసి పేస్టులా చేసుకోవాలి. దీనిని రాత్రి పూట పడుకోబోయే ముందుగా బొడిపెపై రాసుకుని పడుకోవాలి. ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
- రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఆపిల్ సైడర్ వెనిగర్ బొడిపెల మీద రాసి ఉదయాన్నే కడుగాలి.

479
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles