ముంబై టు లండన్


Mon,July 17, 2017 12:54 AM

వయసు శరీరానికేగాని మనసుకు కాదు. దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించొచ్చు. ఇదే విషయాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపించిందీ జంట. తీర్థయాత్రలు చేయాల్సిన వయసులో సాహసయాత్ర చేసొచ్చారీ దంపతులు.
mumbai-couple
అది 2011. రాజస్థాన్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బద్రి బల్దావా భార్యతో కలిసి విమానంలో లండన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో కిటికీలోంచి కిందికి చూసిన బద్రి.. ఇదే లండన్‌కు కొండలు, గుట్టల్ని దాటుకుంటూ రోడ్డుమార్గంలో వెళ్తే ఎలా ఉంటుందని భార్యతో అన్నాడు. అప్పుడామె నవ్వుతూ అదంతా జరుగని పని అంటూ కొట్టిపారేసింది. బద్రి మాత్రం ఆ ఆలోచనను ఒక ప్రాజెక్టులా భావించాడు. దానిపై కొన్నేళ్ల పాటు కసరత్తు చేశాడు. లండన్‌తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను రోడ్డుమార్గం ద్వారా చుట్టి వచ్చేలా రూట్‌మ్యాప్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 ఏళ్లు. అయినా ఎలాంటి భయం లేకుండా 2016 మే నెలలో 63 ఏళ్ల భార్య, పదేళ్ల మనువరాలితో కలిసి ముంబై నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాడు. తమ ప్రయాణంలో తొలుత థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టిన బద్రి.. చైనా, కిజికిస్తాన్, రష్యా సహా 19 దేశాలు చుట్టొచ్చారు. రోజులో 12 గంటల పాటు 400 కిలోమీటర్ల చొప్పున 72 రోజులు ప్రయాణం చేశారు. ఎంతో కష్టమనుకున్న యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన బద్రి దంపతులు తమ ప్రయాణ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. బంధుమిత్రుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.

374
Tags

More News

VIRAL NEWS