మీరు ఏం తినాలో మేం చెప్తాం!


Mon,September 26, 2016 12:16 AM

అబ్బ.. మస్తు ఆకలేస్తుంది! జేబులో డబ్బులు కూడా సరిపడా ఉన్నయ్! ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని పుష్టిగా తినాలి.. తిండికంటే ఎక్కువేముంది? అని ఎంతంటే అంత.. ఏది పడితే అది.. తినే బాపతా మీరు?

అయితే ఇక ఆపండి. కనిపించిన ప్రతీది తినడం ఇక కుదరని పని! మీకు నచ్చిందని మీరు మాత్రమే డిసైడ్ అయితే సరిపోదు! ఫలానా ఆహారం తినాలంటే మీ ఏజ్.. ఎత్తు.. బరువు డిసైడ్ చేస్తాయి! ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అదే ఇప్పటి ఫుడ్ ట్రెండ్.. న్యూట్రిషియస్ ఫుడ్ హెల్దీ మంత్ర!

ఆహారం.. శరీరానికి ఇంధనం. శరీరాన్ని నడిపించేది.. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించేది అదే. అవసరాలకు తగ్గట్టు ఆహారం తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ ఇక్కడ అసలు సమస్య.. మనం తినే ఆహారాన్ని మార్కెట్ శాసిస్తోంది. ఏది తినాలో నిర్ణయించే హక్కు మెనూకార్డ్ లాగేసుకుంటోంది. ఇక ఎంత తినాలనేదాన్ని రుచి నిర్ణయిస్తే.. ఎప్పుడు తినాలనే విషయం పనివేళలు నిర్దేశిస్తాయి. కానీ నీ ఒంటికి ఏది మంచిది..? ఏది తింటే పోషకాలు లభిస్తాయి? అని ప్లాన్ వేసుకొని తినడం ఆలోచిస్తే మంచిదికదా!
sindhu
నేటి యువత లైఫ్‌స్టయిల్ మారిపోయింది. కొందరేమో ఏదీ తినకుండా పస్తులుంటారు. మరికొందరేమో ఏది దొరికితే అది తినేస్తుంటారు. ఎంత పడితే అంత లాగించేస్తుంటారు. ఈ ఎడాపెడా తిండే చాలామటుకు ఆరోగ్యాలతో ఆటలాడుతుందని ఆహారంపై అధ్యయనం చేసి.. స్టార్టప్ ప్లాన్ చేశాడు ఆదిలాబాద్‌కు చెందిన లింగాల గోపీకృష్ణ. ఆయన ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఆ స్టార్టపే LeanSpoon.com.

ఇండియాలోనే ఫస్ట్!


రేట్స్‌ను బట్టి.. డబ్బుల వెసలుబాటును బట్టి తింటే కడుపు నిండుతుందేమోగానీ.. ఆరోగ్యకరం కాదనేది LeanSpoon.com ఉద్దేశం. శారీరక అవసరాలను బట్టి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలనేది దాని కాన్సెప్ట్. న్యూట్రిషనల్ కస్టమైజ్డ్ ఫుడ్ సప్లయ్ చేస్తోన్న ఇండియాలోనే తొలి స్టార్టప్ ఇది. అంటే ఇక్కడ మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చేస్తే ఆహారం దొరకదు. మిమ్మల్ని చూసి మీకేదివ్వాలో వాళ్లే చెప్తారు. టేస్టేంటో చెప్తే చాలు. మీ ఫిజికల్ ఫిట్‌నెస్‌కు తగిన వంటకాన్నిస్తారు. నేరుగా ఇంటికి లేదా ఆఫీస్‌కు కూడా సప్లయ్ చేస్తారు.

ఆహారమూ వేరైతే!


దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ పోషకాహారం ఓ సమస్యగా మారిందని భావించాడు గోపీ. లక్సెట్టిపేట ఆయన సొంతూరు. ఊళ్లో ఉన్నప్పుడు తిన్న పోషకాహారం.. దాదాపు పదేళ్లు భార్య సనీషా రామతో కలిసి విదేశాల్లో ఉన్నాడు. అక్కడ శారీరక శ్రమకు తగ్గట్టు ఆహారం తీసుకోవడం కచ్చితంగా పాటించే రెస్టారెంట్లు.. హోటల్స్ ఉన్నాయి. భిన్న వ్యక్తులు.. విభిన్న ఆహారం వాళ్ల ఆరోగ్య రహస్యం. కానీ.. మన దగ్గర.. పెద్దవాళ్లు అదే తింటారు.. చిన్నవాళ్లు అదే తింటారు.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అంతా ఏకరీతి ఆహారం తింటారు. కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లయ్ ద్వారానే ఈ పరిస్థితి మార్చేందుకు స్టార్టప్ లాంచ్‌చేశారు గోపీకృష్ణ. దీనికి ఆయన భార్య సనీషా రామ సహకారం కూడా తీసుకున్నాడు.

అకౌంట్ సహాయంతో!


LeanSpoon.com వెజ్.. నాన్ వెజ్ వంటకాలు అందిస్తోంది. ఇండియన్ థాలీ.. వెస్ట్రన్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్స్‌లో రుచిలేని వంటల బాధను తప్పించుకోవాలంటే రెడీమేడ్.. జంక్‌ఫుడ్ నుంచి హెల్దీఫుడ్ హాబిట్‌కు మారాలంటే ఈ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ తెరిచే ముందు పేరు.. వయసు.. బరువు.. ఎత్తు.. అనారోగ్య సమస్యల వివరాలను సూచించిన కాలమ్స్‌లో నింపాలి. అనారోగ్య సమస్యలు లేకున్నా గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలను ప్రస్తావించాలి. అలాగే అమ్మానాన్న అనారోగ్య సమ్యలను కూడా రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉంటే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను కూడా అప్‌లోడ్ చేయాలి.

ఇంటి రుచి!


రోజూ ఒకే విధమైన ఆహారం కాకుండా ఫుడ్ ఐటమ్స్‌ని మార్చుతూనే.. న్యూట్రిషనల్ వాల్యూస్‌ని మెయింటెన్ చేస్తారు. ఈ మీల్స్ ఆర్డర్‌లో అయిదు రోజులు మొదలు ఏడాదికి ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఆర్డర్‌ను బట్టి వండిన ఈ వంటలు ఇంట్లో వండిన రుచి ఉంటాయి. హోటల్స్‌లో మాంసం, కూరగాయలను వేరుగా ఉడికించి కష్టమర్‌కు అందించే సమయంలో వాటిని కలిపినట్లుగా కాకుండా సంప్రదాయబద్దంగా వండటం ఈ LeanSpoon ప్రత్యేకత. మీరు ఆహారం తీసుకుంటుంటే మార్పు ఎలా ఉందో ట్రాక్ చేస్తారు. ప్రతి రోజూ మెయిల్.. వారానికి ఒక సారి ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారు.

వాల్యూస్ ఆడిటర్ సహాయంతో!


sindhu2
కాలిఫోర్నియా రెస్టారెంట్ల మాదిరి న్యూట్రిషనల్ వాల్యూస్‌ని కస్టమైజ్డ్‌గా అందించాలనేది వాళ్ల కాన్సెప్ట్. ఆహార సలహాలు, ఆహార విక్రయం రెంటినీ అనుసంధానించే స్టార్టప్ కోసం సింధూని కలిశారు. బెంగళూరు యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎమ్మెస్సీ డిగ్రీ పూర్తి చేసిన యువతి సింధు. న్యూట్రిషియన్ వాల్యూస్ ఆడిటర్‌గా చేసిన అనుభవం ఉందామెకు.

అపాయింట్‌మెంట్ ఆప్షన్!


అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు న్యూట్రిషనల్ అడ్వైజ్ కోసం కన్వర్జేషన్ అపాయింట్‌మెంట్ ఆప్షన్ ఉంటుంది. మీకు కావాల్సిన రోజు.. సమయాన్ని పుడ్ అండ్ న్యూట్రిషనిస్ట్ అపాయింట్‌మెంట్ కోసం సూచించాలి. తర్వాత ఆ టైమ్‌కు LeanSpoon. com నుంచి ఫోన్ వస్తుంది. న్యూట్రిషనిస్ట్ మీతో మాట్లాడి మీ అవసరాలను.. ఇష్టాలను తెలుసకుంటారు. ఏ ఆహారం ఎక్కువగా అవసరమో.. ఏవి తక్కువగా తీసుకోవాలో సూచిస్తారు. లావు పెరిగాలనుకునే వాళ్లు.. తగ్గాలనుకునేవాళ్లకు కావాల్సిన కేలరీలు.. ప్రొటీన్స్.. మైక్రో న్యూట్రిషియంట్స్ ఎంత మోతాదులో ఆహారం ద్వారా తీసుకోవాలో చెప్తారు. మీరు ఓకే అంటే ఆ తర్వాత మీ చిరునామాకు నేరుగా ఆహారం వస్తుంది.

ట్రయల్ ప్రమోషన్స్ ద్వారా!


సింధూ సహకారంతో భారతీయుల ఆహార అలవాట్లు.. పోషక విలువల అవసరాల గురించి తెలుసుకున్నారు గోపీ. లైఫ్‌ైస్టెల్‌కు తగ్గట్టు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓ క్లారిటీ వచ్చింది. ఫుడ్ అడ్వైజ్, ఫుడ్ సైప్లె విషయంలో స్టార్టప్‌కు కావాల్సిన ఏర్పాట్లు తెలుసుకున్నారు. సింధూ మెనూ డిజైన్‌కు తగ్గట్టు వండి వార్చే షెఫ్ ఎవరనే ఆలోచన వచ్చింది. అప్పుడే షెఫ్ సందీప్ గురించి తెలిసింది. విదేశాల్లోని స్టార్ హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసిన సందీప్ బృందంతో డీల్ కుదిరింది. ఇంకేముందు బిజినెస్ స్టార్ట్ అయింది. మూడు నెలల తర్వాత.. ట్రయల్స్‌లోనే కమర్షియల్ ఆఫర్స్ వచ్చాయి. ఈ ట్రయల్స్ ప్రమోషన్‌కు బాగా దోహదపడ్డాయి. అన్నీ ఒకే అయి LeanSpoon. com మంచి కస్టమైజ్డ్ ఫుడ్ సప్లయ్ కమర్షియల్ కంపెనీగా ఎదిగిందని చెప్తున్నారు గోపీకృష్ణ.. ఆయన భార్య సనీశా రామ.. న్యూట్రిషనిస్ట్ సింధూ.. చెఫ్ సందీప్. మీకు హెల్దీఫుడ్ కావాలంటే LeanSpoon.com, లేదా 040-4664 5555 ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచిస్తున్నారు.
- నాగవర్ధన్ రాయల
-కంది సన్నీ

3528
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles