మీకు నేనున్నాను!


Mon,December 10, 2018 02:31 AM

పేదరికంలో పుట్టింది. తండ్రి తాగుబోతు, తల్లి సంపాదనతో కుటుంబం నడిచేది. జీవితంలో పడాల్సిన బాధలన్నీ చిన్నప్పుడే భరించింది. ఆ సంఘటనలే ఇప్పుడు ఎంతో మందిని మామూలు స్థితికి తీసుకురాగలుగుతున్నది. మీకు నేనున్నానంటున్నదీమె.
manika
ఈమె పేరు మనికా మజుందర్. ఇండియాలో మధ్యతరగతి కుంటుంబాలు ఎక్కువగా డిప్రెషన్‌కి లోనవుతున్నాయి. ఇది ఒక సర్వేలో తేలింది. అయితే వీరిని మామూలు స్థితికి చేర్చలేమా? చేయగలం.. వారికి మేమున్నామంటూ ఒక భరోసా ఉండాలి. అప్పుడే వాళ్లు మామూలు స్థితికి రాగలరు. అలా వారిని మామూలు స్థితికి తీసుకొచ్చే పనిలో పడింది మనికా. 2009లో జన మనబ్ స్వస్థ్య కేంద్రం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్తున్నది. మూడేండ్లలో 500 కుటుంబాలు తిరిగి 3,500 మందిని మామూలు స్థితికి తీసుకువచ్చింది. హాస్పిటల్, పోలీస్‌స్టేషన్, పోలియో శాఖ, పాఠశాల, ఆరోగ్య అధికారులు అందరినీ పలకరిస్తూ మీకు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తున్నది మనికా. ఇలా అందరిలో స్ఫూర్తి నింపే ఈమె జీవితం ఏమీ పూల బాటేం కాదు. తల్లి కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించేది. తండ్రి తాగొచ్చి ఇంట్లో గొడవ పెట్టుకొనేవాడు. మనికాకి రెండు సంవత్సరాలు నిండకముందే బెంగళూరు నుంచి కోలకతాకు వచ్చారు. అక్కడ తల్లి సంపాదించిన దానితోనే మనికా చదువుకునేది.

కొన్ని రోజుల తరువాత మనికాకి తమ్ముడు పుట్టాడు. డెలివరీ తరువాత కొన్ని రోజులు తల్లి ఏ పనీ చేయలేక పోయింది. ఇంట్లో చిల్లిగవ్వకూడా లేదు. ఆహారానికి చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు కూడా తండ్రి పట్టించుకునేవాడు కాదు. మనికా స్కూల్‌కి వెళ్లడం, బాబుని చూసుకోవడం రెండూ చేసేది. అనుకున్నట్టుగానే మనికా తండ్రి స్కూల్ మాన్పించేశాడు. అందరూ స్కూల్‌కి వెళ్లి బాగా చదువుకుంటుంటే మనికా మాత్రం ఇంట్లో తమ్ముడిని చూసుకునేది. ఆ సమయంలో ఒంటరిగా బాధపడేది. మనికాకి 17 యేండ్ల వయసులో పెండ్లి చేశారు. వివాహంతో మనికా జీవితంలోకి సంతోషం వచ్చింది. మనికా భర్త తనకు నచ్చిన దాంట్లో పనిచేసేందుకు ఒప్పుకొన్నాడు. కానీ కొంతకాలం ఆమె ఏ పనీ చేయలేదు. 2008 సంవత్సరంలో డిప్రెషన్‌కి లోనయి, మెంటల్ బ్యాలెన్స్ తప్పిన వారిని తిరిగి మామూలుగా మార్చడానికి ఒక ఎన్జీవో నడుం బిగించింది.

వాళ్లు కొంతమంది ప్రేరణ కలిగించే మహిళల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పనికి మనికా కూడా ఐప్లె చేసింది. కానీ దానికి పదవ తరగతి పాస్ అయుండాలనే నిబంధన ఉంది. మనికా చూస్తే ఆరో తరగతే చదివింది. అయినా పట్టు వదులకుండా ప్రయత్నించింది. ఆమె పట్టుదల చూసి ఆ సంస్థ మనికాని తీసుకోకుండా ఉండలేకపోయింది. అలా అందరికీ భరోసా కల్పించే పనిలో మునిగిపోయింది మనికా!

980
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles