మిస్టర్ కూల్‌కి ప్రేమలేఖ!


Sat,July 7, 2018 11:10 PM

మైదానంలో మిస్టర్ కూల్‌గా, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల సమర్థవంతమైన కెప్టెన్‌గా, ఆటగాడిగా ధోని ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల అభిమానాన్ని గెలుచుకున్నాడు. జులై 7న ధోని 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఈ సంధర్భంగా సాక్షి ధోని చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది.
sakshi_dhoni
ధోనీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో మిస్టర్ కూల్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండియన్ క్రికెట్‌కి ధోని చేసిన సేవను పొగుడుతూ పెట్టిన పోస్టులు, ట్వీట్లకైతే లెక్కేలేదు. వాటన్నింటినీ మించి దోని భార్య సాక్షి ధోని హ్యాపీ బర్త్ డే టు యు! నీలోని మానవత్వాన్ని, మంచితనాన్ని మాటల్లో, అక్షరాల్లో చెప్పాలంటే నేను న్యాయం చేయలేనేమో. గత పదేళ్లుగా నేను నిన్ను చూస్తున్నాను. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను కూడా. నా జీవితం ఇంత అందంగా ఉండేందుకు కారణమయ్యావ్. ఎలా జీవించాలో నేర్పించావ్‌అంటూ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా, భార్య, కూతురుతో కలిసి ధోని పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు.

733
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles