మినరల్స్‌తో బీపీ కంట్రోల్


Tue,May 14, 2019 01:40 AM

ఎండాకాలం కదా? నీళ్లు ఎన్ని లీటర్లు తాగుతున్నారు? ఎలాంటి నీళ్లు తాగుతున్నారు? ఎలాంటి నీళ్లేంటి.. మంచినీళ్లే తాగుతున్నాం అని మాత్రం అనకండి. తాగే నీటిలో మినరల్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనే దాన్నిబట్టే మీ బీపీ కంట్రోలింగ్ అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
Mineral-Water
తాగేనీటిలో లవణీయత శాతం ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలంటున్నారు సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణులు. ఎక్కువ మినరల్స్.. లవణీయత ఉన్న నీటిని తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందట. ఎండకు తట్టుకోలేక ఏది దొరికితే అది తాగడం కాకుండా మినరల్స్ పుష్కలంగా ఉన్న నీటిని తాగాలి. బయట దొరికే నీటిలో అధిక స్థాయిలో ఉన్న సోడియం.. క్యాల్షియం.. మెగ్నీషియం ఉంటాయి. మోతాదుకు మించి ఇవి ఉండటం వల్ల బీపీ.. హైపర్‌టెన్షన్ సమస్యలు వస్తాయి. వీటివల్ల గుండె సమస్యలు కలుగుతాయి. లివర్ సమస్యలు కూడా దరిచేరుతాయి. అంటే లేనిపోని ఆరోగ్య సమస్యలన్నీ వెంటాడుతాయన్నమాట. కాబట్టి తాగే నీరేదో మినరల్స్ ఎక్కువశాతం ఉన్నవి తాగితే బీపీ.. హైపర్‌టెన్షన్‌లకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు. బంగ్లాదేశ్‌లో కోస్తా తీరంలో మినరల్స్ లేని నీళ్లు తాగడం వల్ల రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు చెప్పారు.

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles