మా నాన్నకేమీ పర్వాలేదా?


Tue,June 6, 2017 12:16 AM

మా నాన్న వయసు 72 సంవత్సరాలు. ఇంట్లో జారిపడితుంటి కీలు ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే లాప్రోస్కోపీ విధానంలో సర్జరీ చేసి చికిత్స అందించాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆయన డయాబెటిక్. మందులు వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్జరీ సమస్య కాదా? సర్జరీ తర్వాత ఆయన మామూలు జీవితం గడుపగలుగుతారా? దయచేసి పూర్తి వివరాలు తెలుపగలరు?
కృపాకర్, వరంగల్
slider
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ నాన్నగారు షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థం అవుతోంది. కాబట్టి లాప్రోస్కోపీ విధానంలో సర్జరీ చెయ్యడమే మంచిది. ఎందుకంటే ఈ విధానంలో నొప్పి తక్కువగా ఉంటుంది. కండరాలు కూడా దెబ్బతినవు. వీలైనంత త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది తుంటి ఎముక ముందు భాగం నుంచి చేస్తారు. ఈ సర్జరీ తుంటి ఎముక ముందు భాగం నుంచి చేస్తారు. ఎందుకంటే తుంటి ఎముకకు దగ్గరగా ఉండే భాగం అదే. కాబట్టి నేరుగా సర్జరీ చెయ్యవచ్చు. కోత పెద్దగా ఉండదు. రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నొప్పి కూడా తక్కువ కాబట్టి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంది. అయితే సర్జరీకీ ముందే షుగర్ పూర్తిగా అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. మందుల్లో అవరసమైన మార్పులను గురించి డాక్టర్ మీకు వివరిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్జరీకి వెళ్తే ఎలాంటి కాంప్లికేషన్లు లేకుండా త్వరగానే ఇంటికి వెళ్లిపోవచ్చు. సర్జరీ తర్వాత 2, 3 వారాల్లో తిరిగి మాములైపోతారు.

డాక్టర్ ప్రవీణ్ మారెడ్డి
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

456
Tags

More News

VIRAL NEWS