మార్త.. ఓ వెలుగు దివ్వె


Sun,August 13, 2017 01:23 AM

మనదేశంలో ఉన్నవాళ్లు మనకు సాయం చేయడం కష్టంగా ఉంది. అలాంటింది ఓ విదేశీయురాలైయుండి.. మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్న మహిళల బాధలు చూసి చలించిపోయింది. రహదారి సౌకర్యం కూడా లేని ఆ గ్రామాలకు తనవంతుగా ఏదైనా చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమె ఏమీ చేసిందంటే..?
Marta-USA
అమెరికాకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని మార్త వండూజర్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చాలానే చేసింది. 2012లో యూపీకి వచ్చిన మార్త.. బెటర్ విలేజ్ బెటర్ వరల్డ్ నినాదంతో కేంద్రప్రభుత్వ సహాయంతో దాదాపు 143 పర్యావరణ హిత మరుగుదొడ్లను కట్టించింది. అంతేకాదు దాదాపు పది అడుగుల వెడల్పుతో దాదాపు 122 మీటర్ల రడ్ల నిర్మాణానికి చేయూతనందించింది. దాదాపు 82 మరుగుదొడ్లకు తన డబ్బులు ఖర్చుచేసింది. కరెంట్ సౌకర్యం లేని 27 ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది మార్త.

439
Tags

More News

VIRAL NEWS

Featured Articles