మానసిక ఆందోళన తగ్గడానికి..


Tue,July 18, 2017 12:34 AM

పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా ప్రతివారు ఏదో ఒక ఆందోళనతో నిత్యం సతమతమైపోతున్నారు. ఇది చివరికి ప్రాణాన్ని కూడా తీసేదాకా వెళుతున్నది. అందుకే ఆ ఆందోళనలు తగ్గడానికి ఈ ఆసనాలు ప్రయత్నించండి.
naadi-shodana

నాడీ శోధన ప్రాణాయామం


సుఖాసనంలో కూర్చొని కుడిచేతి వేళ్లని ముఖం ముందుకి తీసుకురావాలి. చూపుడువేలు, మధ్యవేలుని నెమ్మదిగా కనుబొమ్మల మధ్య ఉంచండి. బొటనవేలిని కుడి ముక్కు మీద, ఉంగరం వేలుని ఎడమ ముక్కుపైన ఉంచండి. చిటికెన వేలుని కొద్దిగా మడిచి విశ్రాంతిగా ఉంచండి. ఇప్పుడు మెల్లగా ఉంగరపు వేలు పైకి లేపి ఎడమ ముక్కు నుంచి మెల్లగా శ్వాస తీసుకొని, ఆ ముక్కుని ఉంగరపు వేలితో మూయాలి. ఇప్పుడు మళ్లీ కుడి ముక్కు నుంచి శ్వాసను మెల్లగా వదలాలి. ఇప్పుడు కుడి ముక్కు నుంచి గాలి తీసుకొని, ఎడమ ముక్కు నుంచి గాలి వదులాల్సి ఉంటుంది. ఇదే ప్రక్రియను రెండు నుంచి ఐదు నిమిషాల వరకు చేయాలి.

ఉపయోగాలు :


-మానసిక ఆందోళన అంతమైపోతుంది.
- ఏ సమస్యనైనా ధైర్యంగా,
వీరోచితంగా ఎదురించి పోరాడగల మనోశక్తి లభిస్తుంది.
-ఒత్తిడి, కోపం తగ్గుతాయి.
- ఏకాగ్రత పెరిగి మనస్సు శాంతమౌతుంది.
-నాడులు శుభ్రపడుతాయి. నరాల సమస్యలు తగ్గుతాయి.
-రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నటరాజాసనం


nataraja
నిటారుగా నిలబడి ముందుగా కుడి కాలును వెనుకకు మడిచి, కుడి చేత్తో కుడికాలి మడిమను పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకి లేపి చిన్‌ముద్ర పెట్టాలి. కుడి చేయిని, కాలిని పైకి లేపాలి. ఈ స్థితిలో ఎదురుగా ఉన్న ఏదైనా వస్తువును నిరంతరం చూస్తూ ఉండాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండి, తిరిగి యథాస్థితికి రావాలి. ఇప్పుడు కాలు మార్చి చేయాల్సి ఉంటుంది. రెండు కాళ్లతో ఐదు నుంచి పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు :
- మానసిక ఆందోళన తగ్గుతుంది.
- మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
- ఏకాగ్రత పెరుగుతుంది.
- చేతులకు, కాళ్లకు బలం చేకూరుతుంది.
- మూలశంక వ్యాధి నయమౌతుంది.

జాగ్రత్తలు :


- మోకాలి నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం నిపుణుని పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
- ఈ స్థితిలో శరీరం అదుపు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.
జె. దుర్గేష్ కుమార్
యోగా ట్రైనర్,
సంతూస్ స్టూడియో
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్9704229212,

1179
Tags

More News

VIRAL NEWS

Featured Articles