మన దేశం నుంచి తొలి యువతి


Wed,September 19, 2018 01:38 AM

ఈ యువతికి చిన్నప్పటి నుంచి ఎగిరే వస్తువులంటే ఆసక్తి. అవి ఎలా ఎగురుతున్నాయి? అందుకు వాడే పరికరాలు ఏంటి? అంటూ అప్పటి నుంచే అధ్యయనం మొదలుపెట్టింది. ఆ ఆసక్తినే తన జీవిత లక్ష్యంగా మార్చుకొని, యూఎస్ అందించే ప్రతిష్టాత్మక అవార్డుకు మన దేశం నుంచి ఎంపికైన తొలి మహిళగా చరిత్రకెక్కింది.
sonal
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన సోనాల్ బైడ్ అనే ఈ 28యేండ్ల యువతి అమెరికా అందించే ప్రతిష్టాత్మక ఉమెన్ టు వాచ్ ఇన్ యూఏఎస్ అనే అవార్డుకు ఎంపికైంది. మన దేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి మహిళ సోనాల్. ఈమె డ్రోన్లను రూపొందించడంలో దిట్ట. అంతేకాకుండా, వాటిని మహిళల రక్షణ కోసం ఉపయోగిస్తున్నది. డ్రోన్లను పలు విధాలుగా ఉపయోగించుకోవడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందిస్తున్నది. ఇదే అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన పదిమంది మహిళల్లో సోనాల్ ఒకరు. విమానంలోని మెషిన్‌కి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకొని ఏవియేషన్ కోర్స్ చేసింది.

వసాడ్‌లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేసింది. యూఎస్ వెళ్లి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన డ్రోన్స్‌ను తయారు చేయడం ప్రారంభించింది. శాన్ ఫ్రాన్సిస్‌కో కిట్టిహాక్ అనే సంస్థలో చేరి, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగానికి అధిపతి అయింది. అక్కడ ఉమెన్ అండ్ డ్రోన్ గ్రూప్‌తో సంబంధాలు ఏర్పరుచుకొని తన ఆలోచనలకు తగ్గట్లుగా డ్రోన్స్ రూపొందించింది. ప్రస్తుతం తన తెలివితేటల ఆధారంగా ఎయిర్‌బస్, జెన్‌పాక్ట్ మీద పెట్టింది. సోనాల్ ప్రస్తుతం పెద్ద కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. దేశ, మహిళల రక్షణలో డ్రోన్స్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నది. సోనాల్ మన దేశం తరఫున ఎంపికైనందుకు ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

1242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles