మనసున్న కిలాడీ


Wed,January 8, 2014 03:17 PM

బాలీవుడ్‌లో కిలాడీలా కనిపించినా.. అక్షయ్‌కుమార్ మనసున్న మనిషి. తండ్రి హరిఓం భాటియా అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే తండ్రి చనిపోయాక ఆయన పేరుతో ‘హరి ఓం ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడా పరంపరను కొనసాగిస్తున్నాడు. ఆర్మీలో పనిచేసి క్యాన్సర్‌తో చనిపోయిన తండ్రి జ్ఞాపకార్థం ‘హరిఓం క్యాన్సర్ షెల్టర్’ ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా పోలీసులకోసం ఏర్పాటు చేసిన ఈ షెల్టర్‌ను ఇటీవలే ప్రారంభించాడు. అయితే ఈ షెల్టర్ ఏర్పాటు చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అక్షయ్ కుమార్.. తండ్రి హరి ఓం భాటియా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం టాటా మెమోరియల్ హాస్పిటల్ వెళ్లేవాడు. అక్కడ ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన చాలామంది పోలీసులు... ఉండటానికి సౌకర్యం లేక, తినడానికి తిండి కూడా లేక పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశాడు. Akshay-Kumarకచ్చితంగా వారికోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనాటి కల ఇప్పటికి సాకారమయ్యింది. భోజన సౌకర్యంతోపాటు ఏసీరూమ్స్, టీవీ సౌకర్యం ఉన్న ఈ షెల్టర్‌లో రోజుకు నాలుగు వందల రూపాయలు చెల్లించి ఉండొచ్చు. ప్రస్తుతం ఇందులో 30 బెడ్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో ఇంకా గదుల సంఖ్య పెంచే ఆలోచన ఉందంటున్నాడు అక్షయ్.

2360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles