మనసుకు ఆహ్లాదం.. కుట్రాళం


Thu,September 27, 2018 10:59 PM

Courtallam_Five_Falls
బండరాళ్ల మీద నుండి మంచువర్షం కురుస్తుందా? అనే విధంగా ఎత్తైన పర్వతాలనుండి జలధారలు కిందికి జారుతూ మనసును హత్తుకునే జలపాతం కుట్రాళం వాటర్‌పాల్స్. ఇది పడమటి కనుమల్లోని ఒక భాగం. ఈ కొండలలో ఎక్కడో పుట్టిన ఒక జలధార వర్షపు నీటితో కలిసి పెద్ద ప్రవాహంలాగా వచ్చి ఇక్కడ వున్న కొండ చివర నుంచి జలపాతంలాగా పడుతూ ఉంటుంది. కొండ మీద వున్న అడవులలో పెరిగే రకరకాల ఔషధుల మొక్కలు, చెట్లను కలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీరు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా వుంటుంది. ఈ నీటిలో శారీరకంగా కలిగే అనేక జబ్బులను నయం చేసే గుణం వుంది. దీర్ఘరోగంతో బాధపడుతూ వుండేవారు ప్రతిరోజూ ఈ ప్రవాహంలో స్నానం చేస్తూ వుంటారు. ఈ జలపాతం పడే చోట చిన్న కోనేరు ఏర్పడింది.


ఈ జలపాతం నిజానికి మూడు దశలుగా వుంటుంది. ఇక్కడ స్నానం చేసే కొలనులాంటిది ఆఖరు దశ. ఈ కొలనుకు కొంచెం ఎగువగా అంటే కొండకు పై భాగాన మరొక జలపాతం వుంది. ఇదే నీరు అక్కడ కూడా ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. దీనిని తమిళంలో అంజివళి అంటారు. ఈ అంజివళికి సుమారు అయిదు, ఆరు కి.మీ. దూరంలో ఈ అయిదు ధారలు జన్మించిన చోటు వుంది. ఇది కూడా ప్రవాహానికి అసలు జన్మస్థలంకాదు. చుట్టూ వున్న కొండలలో పడ్డ వర్షపు నీరు పల్లంగా వున్న ఈ ప్రాంతానికి అన్ని వైపుల నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఇక్కడ అయిదు ధారలుగా ఏర్పడుతుంది.

1335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles