మచ్చలేని మోముకు పసుపు!


Sat,August 11, 2018 02:43 AM

పూర్వీకుల నుంచి సౌందర్య ప్రయోజనాల కోసం పసుపు వాడడం చూశాం. దీంట్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని కొత్త రూపు సంతరించుకునేలా చేస్తాయి. ఇంకా దీంతో ఏం కలిపితే చర్మం నిగనిగలాడుతుందో తెలుసా?
turmeric-mask
-ఒక గిన్నెలో పెరుగు, తేనె, కొబ్బరినూనె వేశాక పసుపు వేసి బాగా కలుపాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖం మీద రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-జామ ఆకులను, పసుపుతో కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని మొటిమలు ఉన్న చోట రాసి కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడుతాయి.
-పసుపు, మీగడ, శనగపిండి.. కలిపి పేస్ట్‌లా చేయాలి. జిడ్డు చర్మం వాళ్లు మీగడకి బదులు పాలు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలిగిపోయి ముఖం కాంతివంతమవుతుంది.
-పసుపు, బియ్యంపిండి, టమాటారసం, పాలు అన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేయాలి.
-పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇది ప్రతిరోజూ చేస్తే పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది.
-చెంచాడు పసుపులో, బియ్యంపిండి, టమాటారసం, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముడుతలు తగ్గుతాయి.

311
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles