మందు మోతాదులో లోపాలు!

Mon,June 19, 2017 01:01 AM

Sirap
చిన్న పిల్లలకు టానిక్కులు, సిరప్పులు వేసేటప్పుడు టీస్పూన్ లేదా కొలత కోసం ఇచ్చిన చిన్న మూతనో ఉపయోగిస్తుంటాం. అయితే చాలామంది తల్లిదండ్రులు మందు వేసేటప్పుడు సరైన కొలతలో వేయడం లేదని, దీనివల్ల సమస్యలు రావొచ్చని హెచ్చరిస్తున్నది ఇటీవలి అధ్యయనం. ఎనిమిది, అంతకన్నా చిన్న వయసు పిల్లలున్న 2,110 మంది తల్లిదండ్రులపై చేసిన ఈ అధ్యయనంలో 84.4 శాతం మంది తల్లిదండ్రులు కనీసం ఒక డోస్‌లో అయినా సరైన కొలత మందు ఇవ్వకుండా పొరపాటు చేస్తున్నారని తేలింది.

21 శాతం మంది రెండు మూడు సార్లు కొలిచి మరీ వేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా 2.5 మి.లీ. లాంటి తక్కువ కొలతలో మందు వేసేటప్పుడు మరిన్ని లోపాలు వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవ్వాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా వేసేస్తున్నారు. ఇది అపాయకరం. సరైన మోతాదులో వేయకుండా మందు సరిగా పనిచేయదు. ఇలాంటి కొలత లోపాలను అధిగమించడానికి టీస్పూన్, కొలత కప్పులకు బదులుగా సిరంజి వాడడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు అధ్యయనకారులు.

543
Tags

More News

మరిన్ని వార్తలు...