మందులు మానొద్దు...


Wed,February 10, 2016 01:59 AM

muraliM
నా వయసు 23 సంవత్సరాలు. నాకు పది సంవత్సరాల క్రితం నుంచి మూర్ఛ వ్యాధి ఉంది. పది సంవత్సరాలుగా ఫిట్స్ రావడం లేదు. అయితే ఇప్పుడు నేను నెలల గర్భవతిని. నేను మందులు వాడడం వల్ల బిడ్డకు ప్రమాదం ఉంటుందా?

మూర్ఛ వ్యాధి ఉన్నవారు కచ్చితంగా మందులు వాడవల్సిందే. అయితే ఫిట్స్ మందుల వల్ల కడుపులోని బిడ్డ కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా గర్భం రాకముందు నుంచే ఫోలేట్ అనే మందు తీసుకోవడం మంచిది. ఇది తీసుకుంటే బిడ్డలో లోపాలు వచ్చే అవకాశం చాలా తగ్గుతాయి. అయితే ఒక సారి గర్భం దాల్చి మూడు నెలల గడిచిపోయాయ మందు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. మీరు ఇప్పటికే మూడు నెలలు నిండాయి కాబట్టి రెగ్యులర్‌గా గర్భస్త శిశువుకు స్కానింగ్ చేయించుకోని బిడ్డలో లోపాలు ఏర్పడుతున్నాయేమో గమనించుకోవాలి. మీరు డాక్టర్ సలహాతో మందుల గురించిన నిర్ణయం తీసుకోవాలి. అయితే మరోసారి గర్భం దాల్చడానికి ముందు నుంచే ఫోలేట్ విటమిన్‌ను తీసుకోండి. మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఒక వేళ ఫిట్స్ వస్తే పాపాయికి కూడా ప్రమాదమే.
muraliline
నా వయసు 45 సంవత్సరాలు. పదిరోజుల క్రితం నాకు నడుముకు ఒక పక్క కురుపుల మాదిరిగా వచ్చాయి. పదిరోజుల్లో మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేని నొప్పి వస్తుంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?


మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఇది రావచ్చు. జబ్బు వచ్చినపుడు మందులు వాడితే తగ్గిపోతుంది. దీనికి రెండు మూడు రాకాల మందులతో కంట్రోల్ చెయ్యవచ్చు. మీరు డాక్టర్‌ను సంప్రందించి మీ వసుని బట్టి బరువుని బట్టి మందులు తీసుకుంటే మీ నొప్పి అదుపులోకి వస్తుంది.

1780
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles