భయపెట్టే సినిమాలు మంచివే!


Thu,August 23, 2018 12:37 AM

మనం యథాలాపంగా వెళ్తుంటే.. వెనుక నుంచి ఏదైనా వచ్చినట్టు అనిపిస్తే ఒళ్లు జలదరిస్తుంది. హర్రర్ సినిమాలు ఒంటరిగా చూస్తే ఒక్కోసారి గుండె ఆగిపోవచ్చు. కానీ నిజానికి భయపెట్టే సినిమాలు మంచివేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఎన్నిరకాలుగా అవి మంచివో కూడా వివరించారు.
horror
-జిమ్‌కి వెళ్లే సమయం లేదా? అయితే ఏం పర్వాలేదు.. 90 నిమిషాల పాటు హర్రర్ మూవీస్ చూస్తే 113 క్యాలరీలు ఖర్చయిపోతాయట. ఇది 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినదానితో సమానం.
-దెయ్యాల సినిమాలు చేసినప్పుడు మెదడులో ఒకరకమైన ప్రతిస్పందనలు మొదలవుతాయి. అడ్రినలైన్, గ్లూకోజ్, కార్టిసోల్ మెదడులో ప్రేరేపించబడుతాయి. ఇలా జరుగడం వల్ల నిజజీవితంలో జరిగే ప్రమాదాల వల్ల వచ్చే భయం చాలావరకు తగ్గిపోతుంది.
-భయానక చిత్రాలను చూడడం వల్ల మెదడు న్యూరోట్రాన్స్‌మీటర్లను విడుదల చేస్తుంది. ఇది మెదడు కార్యకాలపాలను పెంచుతుంది. రోజూవారి జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయి.
-భయానక చిత్రాలను చూసేటప్పుడు.. శరీరంలో ఆడ్రినలిన్ స్థాయి పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా సమీకరించుకుంటుంది. మామూలుగా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మహిళల్లో.. పురుషుల్లో తెల్ల రక్తకణాల కార్యకలాపాల పెరుగుదల కనిపిస్తుంది.
-మనం భయపడినప్పుడు.. మన మెదడులో.. మంచి రసాయనాలు అంటే.. డోపమైన్, సెరోటోనిన్ విడుదల అవుతాయి. దీనివల్ల వేరొకరి మీద ప్రేమ కూడా కలుగుతుంది. అందుకే సినిమా చూసేటప్పుడు పెద్దలు పిల్లల చేతిని వదులకుండా పట్టుకొని ఉంటారు. దీనివల్ల పిల్లల్లో పెద్దల పట్ల ప్రేమ పెరుగుతుంది.
-తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మన చుట్టూ ఉన్న వాతావరణం సహకరించదు. ఒత్తిడి కూడా మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు మనల్ని అరిపించే, భయపెట్టే సినిమాలు చూడాలి. అప్పుడు అన్ని ఒత్తిడులు మాయమవుతాయి.

376
Tags

More News

VIRAL NEWS