బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే!


Mon,August 27, 2018 11:24 PM

ఈ మధ్యకాలంలో డైటింగ్ పేరుతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడమే మానేస్తున్నారు. మరికొంతమంది బ్రేక్‌ఫాస్ట్ తినే సమయం లేక ఒక్కసారే మధ్యాహ్నం భోజనం తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Break-Fast
ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు పొరపాటున బ్రేక్‌ఫాస్ట్ తినడం మానకండి. ఎందుకంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అల్పహారం తీసుకోనివారిలో గ్లూకోజ్ స్థాయిలు అదుపుతప్పి, షుగర్ వ్యాధికి కారణమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో డయాబెటిస్ వచ్చే అవకాశం 20 శాతం అధికంగా ఉంటుంది. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు నిర్ణీత బరువుతో, ఆరోగ్యంగా ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేయనివారు బాగా ఆకలితో ఉండటం వల్ల తర్వాత తినే భోజనాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటారు. దీనివల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టం శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.


ముఖ్యంగా జీవక్రియపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు కోపం, చిరాకు కూడా పెరుగుతాయి. ఈ లక్షణాన్నే హ్యాంగ్రీ (ఆకలితో కూడిన కోపం) అంటారు. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం, చాలా సేపటి వరకు ఆకలితో ఉండటం మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ఆ అధ్యాయన సారాంశం. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా చేరి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. సమయానికి తినడం వల్ల లాలాజల ఉత్పత్తి ప్రేరేపితమై.. నాలుకపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. కాబట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం చాలా ఉత్తమని సూచిస్తున్నారు.

109
Tags

More News

VIRAL NEWS