బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఆధునిక చికిత్సలు


Mon,February 19, 2018 11:24 PM

Breast-Cancer
బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సల్లో ముఖ్యమైంది సర్జరీ. ఇది వరకు బ్రెస్ట్ సర్జరీ అనగానే రొమ్ములు పూర్తిగా తొలగించే వారు. కానీ ఇప్పుడలాంటి అవసరం లేదు. రొమ్ములు తొలగించకుండానే కాన్సర్‌కు చికిత్స అందించవచ్చు. పెద్ద కణితులను కూడా 2,3 సార్లు కీమోథెరపీ అందించిన తర్వాత సర్జరీ ద్వారా కణితులను పూర్తిగా తొలగించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇప్పుడు రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ

ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనేది ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీల కలయిక. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స అందించడంతో పాటు బ్రెస్ట్ పూర్వపు ఆకారాన్ని కాపాడుకోవచ్చు.

బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్

బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ముల ఆకృతి మారినపుడు తిరిగి సహజమైన ఆకృతిని ఇస్తూ సరిచేసే ప్రక్రియ ఇది

బ్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్

బాడీ జెట్ టెక్నిక్ అనేది అన్నింటికన్నా సురక్షితమైన, అత్యాధునికమైన పద్ధతి. దీని వల్ల శాశ్వత ప్రాతిపదికపై రొమ్ముల సైజ్‌ను పెంచవచ్చు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఎప్పుడైనా మరింతగా కూడా పెంచుకోవచ్చు. ఇందుకోసం వివిధ రకాలైన ఇంప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి.

బ్రెస్ట్ లిఫ్ట్

ఈ ప్రక్రియని చనుమొనల చుట్టూ ఉండే ఎర్రని భాగంలో చిన్న ఇన్‌సిషన్ ద్వారా నిర్వహిస్తారు. కొన్ని సందర్భాలలో రొమ్ముల పరిమాణం తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. సర్జరీ తర్వాత మిగిలిపోయిన మైక్రోస్కోపిక్ క్యాన్సర్ కణాలను పూర్తిగా తొలగించేందుకు కీమోథెరపీ అవసరమవుతుంది. దీని వల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అధునాతన కీమోథెరపీ మందులు చాలా సురక్షితమైనవి. వీటి వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. ఏర్పడే కొద్దిపాటి దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి.

హార్మోన్ థెరపీ

కొన్ని సందర్భాలలో హార్మోన్ థెరపీని సుమారుగా 5 సంవత్సరాల వరకు ఇవ్వాల్సి రావచ్చు.

వాల్యూమెట్రిక్ మాడ్యూలేటెడ్ ఆర్క్ థెరపీ

ఇది క్యాన్సర్ చికిత్సలో అత్యాధునికమైన విధానం. ఇది రేడియేషన్ డోసును గణనీయంగా తగ్గిస్తుంది. చికిత్సకు అత్యంత తక్కువ సమయాన్ని తీసుకుంటుంది.

పెట్ సీటీ

అధునాతనమైన పెట్ సీటీ స్కాన్ వల్ల 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న కణితులను కూడా గుర్తించవచ్చు.

డిజిటల్ మమ్మోగ్రఫీ

డిజిటల్ మమ్మోగ్రఫీ అనేది కంప్యూటర్‌కి అనుసంధానించి ఉండే ఆధునిక ఎక్స్‌రే పరికరం. దీని వల్ల రేడియేషన్ 50 శాతం వరకు తగ్గించవచ్చు. ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో ఇమేజ్‌లను పొందవచ్చు.
mohana-vamshi

650
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles