బ్రాంకైటిస్‌కు హోమియో


Tue,December 29, 2015 11:27 PM

-వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం మన శరీరంలోని అనేక అవయవాలపై దుష్ప్రభావాల చూపుతున్నాయి. అందులో ప్రధానపమైనవి శ్వాసకోశ వ్యాధులు. ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతన్న వారికి చల్లని వాతావరణం కూడా మరింత ఇబ్బంది కలుగజేస్తుంది.

-మనం సాధారణంగా ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటాం. వాతావరణంలో ఉండే గాలి ముక్కు ద్వారా వెచ్చగా అయి, నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వస్తుంది. ట్రాకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటంది. వీటినే బ్రాంకై అంటారు. ఇది విడివిడిగా ఛాతి కుహరంలో ఇరువైపులా ఉండే ఊపిరితిత్తులలోకి ప్రవేశించి అందులో ఉండే ఆల్విమోలార్ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతుంది.
-శ్వాసతీసుకున్నపుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులలో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాసనాళంలోకి చేరుతాయి. శ్వాసనాళం లోపలి భాగంలో శ్లేష్మపొర ఉంటుంది. ఏదైనా ఇతర కారణం చేత ఇది ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపుకి గురి అవడాన్నే బ్రాంకైటిస్ అని అంటారు. ఇది ప్రధానంగా రెండు రకాలు అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ .

-అక్యూట్ బ్రాంకైటిస్ - బ్రాంకైటిస్ లక్షణాలు రెండు వారాలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే ఆక్యూట్ బ్రాంకైటిస్ అని అంటారు. చాలా వరకు ఈ దశలో శ్వాస నాళములకు ఎటువంటి హాని జరగకుండా తిరిగి కోలుకోవడం జరుగుతుంది. 90 శాతం ఆక్యూట్ బ్రాంకైటిస్ ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, రైనోవైరస్ వంటి వైరస్‌ల కారణంగా వస్తుంది. మిగతా 10 శాతం బ్యాక్టీరియా పొగతాగడం, రసాయనాలు, అసిడిటి వంటి వాటి కారణంగా వస్తుంది. దగ్గు, కఫం, పిల్లికూతలు, జ్వరం, ఆయాసం వంటివి ప్రధాన లక్షణాలు.
-క్రానిక్ బ్రాంకైటిస్ - ఏడాదిలో మూడు నెలల పాటు దగ్గు, తెమడ ఉన్నట్లయితే క్రానిక్ బ్రాంకైటిస్‌గా పరిగణిస్తారు. పొగతాగడం, వాతావరణంలో మార్పు, కాలుష్యం ఇన్‌ఫెక్షన్ల కారణంగా శ్వాసనాళాలు దెబ్బతింటాయి.

కారణాలు


-పొగతాగడం బ్రాంకైటిస్‌కి ప్రధాన కారణం, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, వాతావరణం మార్పు వల్ల వైరల్, బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్లు అధికమవడం, జన్యుపరమైన కారణాలు సిస్టిక్ ఫైబ్రోసిస్, హృదయసంబంధిత వ్యాధులు, శరీరంలోని రోగనిరోధక శక్తి లోపించడం వంటి ఇతర కారణాల చేత బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు


-దగ్గు, కఫం, ఇది తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండి కొన్ని సందర్భాలలో రక్తంతో కూడిన తెమడ కూడా ఉండవచ్చు. ఆయాసం, పిల్లికూతలు ఇవి ముఖ్యంగా శ్వాసనాళము వాపు, కఫం కారణంగా సంకోచించడం వల్ల వస్తుంటాయి. ఇవి కాకుండా నీరసం, గొంతునొప్పి, కండరాలనొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి, దీర్ఘకాలికంగా దగ్గు వల్ల ఛాతిలో నొప్పి, జ్వరం, అరుదుగా చర్మం నీలివర్ణం చెందడం వంటి లక్షణాలు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంది.

నిర్ధారణ పరీక్షలు


-రోగి లక్షణాలను బట్టి, ఛాతి ఎక్స్‌రే, కఫం పరీక్ష, రక్తపరీక్ష, ఏబీజీ వంటి పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. కొన్ని సందర్భాలలో సీటీ స్కాన్, పీఎఫ్‌టీ పరీక్షల ద్వారా ఊపిరితిత్తులు ఆకారం, పనితీరు తెలుసుకోవల్సిన అవసరం ఉంటుంది.

హోమియో చికిత్స


-కాన్‌స్ట్యూషనల్ వైద్య విధానం ద్వారా దీర్ఘకాలికంగా ఉండే దగ్గు, తెమడ వంటి లక్షణాలను తగ్గించడమే కాకుండా శ్వాసనాళములలోని ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపుని తగ్గించడం జరుగుతుంది.

srikanth


హోమియో మందులు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి బ్రాంకైటిస్ తిరిగి పునారావృతం కాకుండా వ్యాధి బారిన పడకుండా చేస్తుంది. మరియు న్యుమోనియా, శ్వాస అవయవములు గుండె సోలిపోవడం వంటి తీవ్రమైన దుష్ఫలితాల నుంచి కాపాడుతుంది. కేవలం రోగి లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధి కారకాలు, మానసిక, శారీరక, వంశచరిత్ర, వ్యక్తిగత చరిత్ర మొదలైన పరిగణనలోకి తీసుకొని వైద్యం ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చెయ్యవచ్చు.

1708
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles