
-చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది.
-బీట్రూట్ రసాన్ని ముఖానికి ప్యాక్‌లా ఐప్లె చేయడంవల్ల చర్మఛాయ మెరుగుపడుతుంది.
-బీట్రూట్ రసంతో శుభ్రం చేసుకుంటే ముఖం కొత్త
కాంతుల్ని విరజిమ్ముతుంది. వారంలో కనీసం ఒక్కసారైనా ఇలాచేస్తే చర్మానికి సహజమెరుపు లభిస్తుంది.
-బీట్రూట్ జ్యూస్ చిక్కగాచేసి ముడుతలున్న ప్రదేశంలో పూయాలి. వారానికి రెండుసార్లు ఇలా పేస్ప్యాక్ చేసుకుంటే ముడుతలు మాయమవుతాయి.
-ఆయిల్ స్కిన్‌తో ఇబ్బందిపడేవారు బీట్రూట్ రసంతో ఉపశమనాన్ని పొందవచ్చు. ముఖంపై బీట్రూట్ రసాన్ని ప్యాక్‌లా వేసుకుని, తడి ఆరిన తర్వాత పాలతో శుభ్రం చేసుకోవాలి. తరుచూ ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది.
-బీట్రూట్ జ్యూస్‌కు, టమాటో జ్యూస్‌ను మిక్స్‌చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంచేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. రెగ్యులర్‌గా ఇలాచేస్తే ముఖంపై ఎలాంటి మచ్చలూ ఉండవు.
-తేనె, పాలు కలిపిన బీట్రూట్ రసాన్ని ముఖానికి పట్టించడం వల్ల పొడిబారిన చర్మంతో ఇబ్బందులు తొలిగిపోతాయి.
-బీట్రూట్ రసాన్ని తరుచూ పెదాలపై రుద్ది, సున్నితంగా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెదాలు పింక్ కలర్లోకి మారుతాయి.