బ్యాగుపై మరకలు పోవాలంటే!


Sat,November 24, 2018 12:19 AM

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో బ్యాగు తప్పనిసరి అవుతున్నది. అలాంటప్పుడు బ్యాగుపై మరకలు పడితే తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి బ్యాగులు కొత్తవాటిలా మెరిసిపోవాలంటే ఇలా చేయండి.
bags
-బ్యాగుపై నల్ల మరకలు ఎక్కువగా పడుతుంటాయి. దానిపై తెలుపు రంగు బూట్ పాలిష్ అద్ది స్పాంజ్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లమరకలు పోయి బ్యాగు కొత్తగా మెరుస్తుంది.
-లెదర్ బ్యాగుపై కెచప్, కూరల మరకలు పడినప్పుడు అరటిపండు తొక్కతో రుద్ది పొడి టిష్యూతో తుడిచేయాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తుంటే బ్యాగుపై ఉన్న మరకలు పోవడమే కాకుండా బ్యాగు కొత్తగా ఉంటుంది.
-నూనె, గ్రీజు మరకలు బ్యాగులపై పడితే.. వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఆ మరకలపై వంటసోడా, మొక్కజొన్న పిండి చల్లి తరువాత రోజూ దూదితో తుడిస్తే మరకలు పోతాయి.
-తెల్లటి బ్యాగుపై పెన్ను గీతలు పడితే పోవడం కష్టం. నెయిల్ పాలిష్ రిమూవర్‌లో దూదిని ముంచి ఆ ప్రాంతంలో అద్దాలి. ఇలా చేసినప్పుడు బ్యాగుపై ఉన్న మరకలు దూదికి అంటుకుంటాయి. ఆ తరువాత బట్టని గోరువెచ్చని నీటిలో ముంచి బ్యాగును శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

627
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles