బులెట్ కవచాలుగా స్పైడర్ సూట్స్


Tue,September 4, 2018 02:59 AM

Padartha-shastram
స్పైడర్ సూట్స్ పేరున అమెరికాలో అక్కడి సైన్యం కోసం తయారవుతున్న కవచాలు నమ్మశక్యం కాని రీతిలో బులెట్ ప్రూఫ్‌లుగా ఉపయోగపడగలవని పరిశోధకులు అంటున్నారు.


జన్యు సాంకేతికతతో పెంచి పోషించిన పట్టు పురుగుల నుంచి తీసిన కృత్రిమ సిల్కు పదార్థంతో తయారైన స్పైడర్ సూట్స్ ఆశ్చర్యకరంగా బులెట్ ప్రూఫ్‌లుగా పనిచేయగలవని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇటీవల ప్రయోగాత్మక పరీక్షల్ని పూర్తిచేసుకున్న ఈ కవచాలను అమెరికాలో సైనికుల కోసం వినియోగించనున్నట్లు తెలుస్తున్నది. శత్రువుల బులెట్ల నుంచి తప్పించుకోవడానికై కొత్తగా విప్లవాత్మక పంథాలో ఈ స్పైడర్ సూట్లను పరిశోధకులు డిజైన్ చేశారు. డ్రాగన్ సిల్క్ పేరున పిలుస్తున్న ఈ కొత్త కృత్రిమ పట్టు పదార్థం స్టీలుకన్నా దృఢమైందని, బులెట్ ప్రూఫ్స్ తయారీకి అత్యంత అనుకూలమని వారు అంటున్నారు. మిచిగాన్ రాష్ర్టానికి చెందిన లాన్సింగ్ నగరంలోని క్రెయిగ్ బయోక్రాఫ్ట్ లాబొరేటరీస్ (Kraig Biocraft Laboratories) వారు ఇప్పటికే అమెరికా సైనికాధికారులకు తొలి ప్రొటోటైప్ ప్యానెల్స్‌ను అప్పగించినట్లు చెబుతున్నారు.

409
Tags

More News

VIRAL NEWS