బిగ్‌బాస్ షోకి కొరియోగ్రాఫర్!


Tue,August 7, 2018 11:27 PM

సమయం: శని, ఆదివాలలో.. రాత్రి తొమ్మిది గంటలు.. బిస్‌బాస్-2 హోస్ట్ నాని డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. ఏదైనా జరుగొచ్చు అంటున్న బిగ్ బాస్‌లో చాలానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు.. ఎగ్జిట్ అవుతున్నారు. సినిమా సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఐతే ఇంతకీ.. నానికి ఇరగదీసే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ముంబైకి చెందిన యువ కొరియోగ్రాఫర్ సుమిత్ కేతన్.
big-boss-show
బిగ్‌బాస్-2 కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయింది. విజయవంతంగా కొనసాగుతూ వస్తున్నది. ప్రారంభ కార్యక్రమంలో సినీ తారలు నృత్యాలు చేసి అలరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని ప్రతి ఎంట్రీకి ఒక కొత్త పాటతో డాన్స్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. బిగ్‌బాస్ సెకండ్ సీజన్ కోసం నానికి డాన్స్ నేర్పిస్తున్నది మంబైకి చెందిన కొరియోగ్రాఫర్ సుమిత్ కేతన్‌ను యువ పలుకరించింది.


ముంబై నుంచి న్యూయార్క్ దాకా..

డాన్స్ అందరికీ ఇష్టమే. సంగీతమొస్తే చాలు కాళ్లు కదుపుతుంటారు చాలామంది. కానీ సంగీతం విని దానికి తగ్గట్టు నర్తించడం మామూలు విషయం కాదు. నర్తించడం పక్కన పడితే మ్యూజిక్‌ను బట్టి డాన్స్ స్టెప్స్‌ను డిజైన్ చేయడం సృజనాత్మకత మీద ఆధారపడి ఉంటుంది. సుమిత్ కేతన్ కొన్ని వేల వేదికలపై నృత్యం చేసి ప్రతిభను చాటుకున్నాడు. వందల డ్యాన్స్‌లను కంపోజ్ చేసి వేలమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటికే పలు టీవీ చానళ్లకు పదుల సంఖ్యలో షోలు చేశాడు సుమిత్. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు డ్యాన్స్ నేర్పించాడు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, మంత్రుల పిల్లల పెళ్లిళ్లకు ఫ్యామిలీ ఈవెంట్లకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. ఒక కాన్సెప్ట్ చెప్తే బడ్జెట్‌ని బట్టి డాన్స్ డిజైన్ చేస్తాడు కేతన్. నూయార్క్‌లో ఉన్న మార్థ గ్రహం స్కూల్ ఆఫ్ కాంటెపరరీ డాన్స్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. ఆరు సంవత్సరాల పాటు శీమక్ దావర్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపున జరిగే కార్యక్రమాల్లో డ్యాన్సర్‌గా పనిచేశాడు. తర్వాత సొంతంగా ఒక వ్యవస్థను స్థాపించి డాన్స్‌కు కొత్త అర్థం చెప్పాలని కొత్త ఐడియాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సుమిత్ కేతన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మొదలుపెట్టాడు. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రతిష్టాత్మక వేదికలపై సుమిత్ డ్యాన్స్ ప్రదర్శనలిచ్చాడు.


big-boss-show2

అవార్డు ఫంక్షన్లు.. భారీ ఈవెంట్లు

లయర్ గోల్డ్స్ అవార్డ్స్ ఇచ్చే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇండియన్ ఈవెంట్లలో డాన్స్ అదరగొట్టడమే కాదు విదేశాల్లో కూడా దుమ్మురేపాడు. దుబాయి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి సుమిత్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ షోకు కొరియోగ్రఫీ చేసిన ఏకైక భారతీయుడు సుమిత్. ఎన్డీటీవీ నిర్వహించిన కార్పొరెట్ టాలెంట్ చాంపియన్‌షిప్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నాడు. కామెడీ నైట్స్ విత్ కపిల్, రంగ్ దే కలర్స్, నచ్ బలియా, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఫిలిం ఫేర్ వేదికలపై చూపరులు నివ్వెరపోయేలా స్టెప్పులేశాడు. సుమిత్‌కు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉన్నది. గతంలో రామోజీ ఫిల్మ్‌సిటీ, నగరంలోని పలు స్టూడియోలలో డాన్స్ చేసిన సుమిత్ అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నానికి డ్యాన్స్ నేర్పుతున్నాడు. జాజ్, బ్యాలెట్, బాలీవుడ్, సల్సా, జివా, వాల్ట్స్, హిప్‌హాప్, కాంటెపరరీ డ్యాన్స్ ఫామ్స్‌కి సుమిత్ పెట్టింది పేరు. వీటితో పాటు వెడ్డింగ్ కొరియోగ్రఫీ, కార్పొరేట్ షోస్, ప్రొడక్ట్ లాంచ్, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇతని ప్రత్యేకతలు.


టాప్ ఇండియన్ కంపెనీలకు ఈవెంట్లు చేశాడు సుమిత్.

హోస్టింగ్ విషయంలో నాకేం భయం లేదు. ఫెర్ఫార్మెన్స్ విషయంక్ష కొద్దిగా భయం ఉండేది. సుమిత్ నా బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకొని స్టెప్స్ నేర్పిస్తున్నాడు. ఓపికగా అతను నాకు నేర్పిస్తుంటే నాకు కూడా నేర్చుకోవాలనే తపన ఇంకా పెరుగుతున్నది. భవిష్యత్తులో మరింత రాణిస్తాడనే నమ్మకం ఉన్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే తనకంటూ ప్రత్యేక స్టయిల్‌ను క్రియేట్ చేయగల సత్తా ఉన్నది అని సుమిత్ కేతన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు నాని.

2097
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles