బాధితుల కోసం క్యాండెల


Fri,August 24, 2018 01:15 AM

ఏదైనా వస్తువు కనిపెడితే అది ఎప్పుడో కానీ ఉపయోగపడితే దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ.. అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడితే దాని విలువ తెలుస్తుంది. విపత్తుల సమయాల్లో అప్పటికప్పుడు తమకు తోచిన విధంగా ఓ ప్రయోగం చేసి వెలుగులు పంచుతున్నారు తిరువనంతపురం ఇంజినీరింగ్ విద్యార్థులు..
CandelaKERALA
ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కేరళ వరద బాధితులకు సాయమందించేందుకు ముందుకు వస్తున్నాయి. కేరళలోని తిరువనంతపురం గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ బోర్టన్ హిల్‌కు చెందిన విద్యార్థులు బాధితుల కోసం ఓ ప్రయోగం చేశారు. తమ నైపుణ్యంతో రూపొందించిన వాటర్ ప్రూఫ్ ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ను కేరళ వరద బాధితులకు ఉచితంగా పంపిణీ చేశారు. క్యాండెల పేరుతో ఓ అత్యవసర ప్రాజెక్టును చేపట్టి ఈ ఆవిష్కరణకు రూపమిచ్చారు వారు. ఐ-ట్రిపుల్‌ఈ చదువుతున్న విద్యార్థులు తక్కువ వోల్టేజీ వినియోగంతో ఎక్కువ వెలుగునిచ్చే ఈ ఎల్‌ఈడీ లైట్లను తయారుచేశారు. వరదల కారణంగా ఎక్కడిక్కడ కరెంటు సరఫరా స్తంభించిపోయింది. కేరళ మొత్తం చీకట్లతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చేసిన ఈ ఆవిష్కరణ బాధితులకు వెలుగులు పంచుతున్నది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చార్జింగ్, విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా వెలిగే ఈ ఎల్‌ఈడీ లైట్లు తయారుచేశారు. ఇదే కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు క్యాండెల ప్రాజెక్టుకు నిధులను సమకూర్చగా, ప్రస్తుత విద్యార్థులు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. కేవలం రెండు రోజుల్లో 50మంది విద్యార్థులు, 550 ఎల్‌ఈడీ లైట్లను తయారుచేసి, ముంపు ప్రాంతాలకు ఉచితంగా పంచారు. ఈ లైట్లు దాదాపు 15గంటల పాటు వెలుగునిస్తాయి. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పర్యవేక్షిస్తూ, సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమించిన ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రాహుల్‌ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.

692
Tags

More News

VIRAL NEWS