బాడీగార్డ్ కల


Wed,January 8, 2014 03:19 PM

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ విశాల హృదయుడని అందరికీ తెలుసు. ఆయన ఎంతో మందిని బాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఇండస్ట్రీలో చాలా మందికి ‘గాడ్‌ఫాదర్’ కూడా. ఆయన పరిచయం చేసిన వాళ్లలో.. కత్రినా, జరైన్‌ఖాన్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్... ఇలా లిస్ట్ చాలానే ఉంది. ఈ లిస్ట్‌లో సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్ అయిన సెహారా కొడుకు కూడా చేరబోతున్నాడు. సల్మాన్‌ఖాన్ వ్యక్తిగత రక్షకుడైన సెహారా కొడుకు ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో అడుగు పెట్టాలనుకుంటున్నాడట. అందుకు సల్లూ సహాయం చేయబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా అతి త్వరలోనే! ‘ఆ అబ్బాయి అందగాడు, నిబద్ధత ఉన్నవాడు. salmanతప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు’ అని సల్మాన్‌ఖాన్ అభివూపాయమట. సల్లూ పరిచయం చేసిన వాళ్లు ఇప్పుడు మంచి స్టార్‌డమ్‌లోనే ఉన్నారు. ఇంతలా చెబుతున్నాడంటే.. ఈ అబ్బాయి కూడా మంచి పొజిషన్‌కి వచ్చి తీరతాడు కాబోలు!

2157
Tags

More News

VIRAL NEWS

Featured Articles