బద్ద కోణాసనంతో సుఖ ప్రసవం


Tue,February 12, 2019 01:27 AM

Pregnant-Woman
బటర్‌ైఫ్లె ఆసనం లేదా బద్ద కోణాసనం వల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మహిళలకు ఉపయోగపడే ఆసనాల్లో ఇది ముఖ్యమైంది.


రెగ్యులర్‌గా ఈ ఆసనం వేయడం వల్ల నెలసరి సమస్యలు పోతాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్లకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. తొమ్మిదవ నెల వరకు కూడా బద్ద కోణాసనం వేయొచ్చు. దీనివల్ల 90% నార్మల్ డెలివరీ సాధ్యమని అంటున్నారు యోగా నిపుణులు. రెండు కాళ్లను చాపి.. వెన్నెముకను నిటారుగా ఉంచుతూ కూర్చోవాలి. రెండు అర చేతుల్ని తొడలపై పెట్టాలి. మోకాళ్లను మడిచి అరికాళ్లు ఒకదానికి ఒకటితాకేలా చేస్తూ రెండు చేతుల్ని మోకాళ్లపై ఉండేలా పెట్టాలి. చేతివేళ్లను జాయింట్ చేసినట్లుగా పాదాలను కలిపి.. మోకాళ్లను నేలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ ప్రెగ్నెన్సీ మహిళలు దీనిని రెగ్యులర్‌గా చేస్తే ప్రసవ సమస్యలు రావు.

216
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles