బతుకులు మార్చిన బంతిపూలు!


Sat,November 10, 2018 01:11 AM

నిషేధిత నల్లమందు తయారీకి ఆ గ్రామం పెట్టింది పేరు. ఇంటిల్లిపాదీ చట్ట విరుద్ధమైన ఆ మందు తయారీలో పాల్గొనేవారు. దీంతో నిత్యం పోలీసుల పహారా, కేసులు, గొడవలతో ఆ గ్రామం రావణకాష్టంలా తయారైంది. అయితే, ఆ గ్రామంలో ఇప్పుడు అనూహ్యమైన మార్పు సంభవించింది. నల్లమందును వదిలి.. బంతిపూలతో తమ బతుకులు బాగు చేసుకుంటున్నారు.
Bantipulu
జార్ఖాండ్‌లోని ఖుంతీ జిల్లాకి చెందిన సోసాకుటి గ్రామ ప్రజలు ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా సంతోషంగా బతుకుతున్నారు. కొన్నేండ్లుగా చట్టవిరుద్ధమైన నల్లమందుని తయారు చేసి ఎన్నో ఇబ్బందులు పడిన ఆ గ్రామ ప్రజలు.. ఇప్పుడు పిల్లాపాపలతో హాయిగా గడుపుతున్నారు. ఆకలిని తట్టుకోలేక, కుటుంబ భారం మోయలేక, చేసే పని అన్యాయమని తెలిసినా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మగవాళ్లు ఎక్కడ పోలీసులకి పట్టుబడితే జైలు పాలవుతారోనని ఇంట్లో భార్య, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు సొసాకుటిలో. ఎందుకంటే నల్లమందును తయారు చేయడాన్ని పూర్తిగా ఆపేశారు గ్రామస్తులు. ఈ గ్రామస్తులు ఎందుకు చెడు మార్గంలో వెళుతున్నారో తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా పోలీసు అధికారి.. కారణం తెలుసుకున్నాడు. అలా మహిళలకు బంతిపూల సాగు గురించి చెప్పాడు. భర్తలతో నల్లమందు తయారీ నిలిపివేయాలని చెప్పాడు. దీంతో ఆ గ్రామస్తులంతా దాదాపు 93 ఎకరాల్లో బంతిపూలను సాగు చేసి, వచ్చిన పంటను విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యికి పైగా కుటుంబాలు బంతిపూల వ్యాపారంపైనే బతుకుతున్నాయి. ప్రతి పండగకు పూల ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చిమరీ వీరి వద్ద పూలు కొనుగోలు చేస్తున్నారు. పోలీసుల అధికారులు కూడా.. గ్రామస్తులు మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

936
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles