బట్టతలకు బై.. అధిక బరువుకు చెక్!


Wed,January 27, 2016 12:40 AM

పురుషుల్లో అయినా, స్త్రీలలో అయినా అందంలో ప్రత్యేక పాత్ర పోషించేది జుట్టే. ఇప్పుడు బట్టతల నుంచి రక్షించుకోవడానికి కూడా వైద్యరంగంలో మంచి చికిత్సలే ఉన్నాయి.
బట్టతల సమస్య పురుషుల్లో 50 శాతం ఉంటే మహిళల్లో అది 25 శాతంగా ఉంది. ఒక వ్యక్తి తల మీద లక్ష నుంచి లక్షన్నర వరకు జుట్టు కుదుళ్లు ఉంటాయి. ప్రతి జుట్టు కుదురు జీవిత కాల సమయం 3-4 సంవత్సరాలుంటుంది. స్త్రీ, పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ రసాయన చర్య వల్ల డిహెచ్‌టిగా మారుతుంది. ఇది కుదుళ్లకు వెళ్లి రక్త ప్రసరణపై ప్రభావం చూపి జుట్టు ఎదుగుదలకు కావాల్సిన సిగ్నల్స్ చేరకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల జుట్టు రోజురోజుకి రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య తలెత్తినపుడు స్టెమ్‌సెల్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్న జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ జరిగేలా చూస్తాయి. మళ్లీ జుట్టు ఎదుగుదలకు సిగ్నల్స్ అందించడంతో అవి పునరుత్తేజమవుతాయి.
ఎసెల్‌ప్లస్ పీఆర్‌పీ ఇంజెక్షన్ : ఎసెల్, పీఆర్‌పీ (ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా)తో కలిపి వెంట్రుకలకు ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వెంట్రుకలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అంతేకాదు జుటు ్టకూడా పెరుగుతుంది. జుట్టును తిరిగి ఉత్పత్తి చేయగల ఫ్యాక్టర్లు పీఆర్‌పీలో ఉంటాయి.
మీసోథెరపీ : ఈ చికిత్సా విధానం రాలిపోతున్న జుట్టును అరికట్టడానికి, కొత్త జుట్టు రావడానికి పనికొస్తుంది. స్టెమ్‌సెల్ సోర్స్ తోనే ఈ థెరపీ జరుగుతుంది. ఈ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా మిశ్రమాన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను మిక్స్ చేసి, తలలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్టెమ్‌సెల్ థెరపీ, మీసోథెరపీ చికిత్సల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్


60 శాతం కంటే జుట్టు లేకుండా బట్టతలతో బాధపడుతున్నవారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు స్టెమ్‌సెల్ థెరపీ కూడా ఉంటుంది. దీనివల్ల 100 శాతం సత్ఫలితాలను పొందవచ్చు.

కొవ్వు తీసేసే నాన్ సర్జికల్ విధానాలు


మన శరీరానికి శక్తిని అందించడానికి కేలరీలు ఎంత అవసరమో అదనపు కేలరీలు అంత హానికరం. ఇవి కొవ్వుగా మారి, శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోతాయి. ఫలితంగా బరువు పెరిగి అందానికి ఎసరు పెట్టడమే కాకుండా రకరకాల జబ్బులను కూడా తీసుకువస్తుంది. అందుకే ఊబకాయం వచ్చిన తరువాత చింతించే బదులు కొంచెం బరువు పెరిగాం అనుకోగానే కాస్మెటిక్ విధానాల ద్వారా కొవ్వును తీసేయించుకోవడం ఉత్తమం. ఒక అంగుళం మందం కొవ్వు నుంచి కావలసినంత మొత్తంలో ఎంత కొవ్వు ఉన్నా తీసేయడం, అదీ సర్జరీ లేకుండా చేయడం ఇప్పుడు సాధ్యం అవుతున్నది.

చికిత్సా విధానం


అల్ట్రాసోనిక్ కావిటేషన్, రేడియోఫ్రీక్వెన్సీ పరికరంతో చికిత్స చేస్తారు. అల్ట్రాకావిటేషన్‌లో కొవ్వు కలిగిన కణం చుట్టూ ఉండే పొరలను ఛిద్రం చేసే గాలి బుడగలను సృష్టించే నిమిత్తమై అల్ట్రాసౌండ్, అల్ట్రాసోనిక్ వేవ్‌ను ఉపయోగిస్తారు. బరువు తగ్గడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్స. చర్మంలోని విద్యుత్ క్షేత్రాన్ని పాజిటివ్ నుంచి నెగటివ్‌కు మార్చే నిమిత్తమై 6 మెగా హెర్ట్ రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. ఇది ప్రాథమిక చర్మాన్ని వికృతీకరణ చేస్తుంది. తర్వాత ఆ చర్మాన్ని బిగుసుకునేలా చేసి, మృదుత్వాన్ని ఇస్తుంది. ఇది కేవలం కొవ్వును తగ్గించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందింపచేస్తుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా చర్మం కింద అదనంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించేందుకు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఉపయోగపడుతుంది. నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటే ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తరువాత ఆ భాగంలోకి అల్ట్రాసౌండ్ వూవ్స్‌ను పంపిస్తారు. ముందుగా అల్ట్రాసోనిక్ జెల్ ఐప్లె చేసి, లో ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్ వేవ్స్‌ను ఫ్యాటీ సెల్స్ పైకి పంపిస్తారు. ఈ చికిత్స విధానంలో రక్తనాళాల పైన గాని, నరాల పైన గాని ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. వారంలో రెండురోజులు ఈ చికిత్స తీసుకోవాలి. ఇవేగాక ఒకే ఒక్క సిట్టింగ్‌లో తగ్గే అవకాశం కూడా ఉంది. తరచు క్లినిక్‌కి రాలేనివారు ఒకే సిట్టింగ్‌లో క్రయోలైపోసిస్ ద్వారా 6-7 అంగుళాలు, 4-5 కిలోల బరువు తగ్గుతారు.

john

2040
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles