బజ్జీ.. భలే.. భలే!


Tue,July 18, 2017 12:47 AM

bajji
సాయంత్రం వేళ చాలా రకాల స్నాక్స్ ఉంటాయి.. ఈ చినుకుల వేళ కొన్ని స్పెషల్స్ కూడా యాడ్ అవుతాయి.. అవే పకోడీలు, బజ్జీలు.. ఇలా బోలెడు రకాలు.. అందులో కారంగా, కరకరలాడే బజ్జీలదే ప్రథమ స్థానం!ఈ తాకే తడిలో వేడివేడి బజ్జీలను ఆరగించండి..

వంకాయ బజ్జీ


BRINJAL-BAJJI
కావాల్సినవి :
వంకాయలు : 8, శనగపిండి : ఒక కప్పు, వేయించిన శనగపప్పు పొడి : అర కప్పు, షాజీరా : అర టీస్పూన్, కారం : ఒక టీస్పూన్, ఆమ్‌చూర్ పౌడర్ : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, పల్లీలు : అరకప్పు, నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, కొత్తిమీర : చిన్న కట్ట, ఉల్లిగడ్డ : 1, కుకింగ్ సోడా : చిటికెడు, ఉప్పు, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 : వంకాయలను చిన్నచిన్న గాట్లు పెట్టి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 :ఒక గిన్నెలో శనగపిండి, శనగపొడి, షాజీరా, ఉప్పు, సోడా, కొద్దిగా నూనె వేసి, నీళ్లు పోసి కలుపాలి.
స్టెప్ 3 : మరో గిన్నెలో కారం, ధనియాల పొడి, ఆమ్‌చూర్ కలుపాలి. ఈ మిశ్రమాన్ని గాటు పెట్టిన వంకాయల్లో కూర్చాలి.
స్టెప్ 4 : ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత ఒక్కో వంకాయను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి. ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టాలి.
స్టెప్ 5 : పల్లీలలను వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపాలి. వీటిని వంకాయలను మధ్యలో కట్ చేసి కూర్చాలి. టేస్టీ వంకాయ బజ్జీ మీ ముందుంటుంది.


బీరకాయ బజ్జీ


RIDGE-GOURD-BAJJI
కావాల్సినవి :
శనగపిండి : 2 టేబుల్‌స్పూన్స్, బియ్యంపిండి : 1/3 టేబుల్‌స్పూన్, బీరకాయ : 1, పచ్చిమిర్చి : 2, షాజీరా : పావు టీస్పూన్, సోడా : చిటికెడు, కరివేపాకు : 2రెమ్మలు, చాట్‌మసాలా : అర టీస్పూన్, ఉప్పు, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 :ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, షాజీరా, సోడా, ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపాలి.
స్టెప్ 2 :బీరకాయలను చెక్కుతీసి, గుండ్రని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఈలోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. బీరకాయ ముక్కలను శనపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 4 :ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పై నుంచి చాట్ మసాలా చల్లి తింటే రుచికరంగా ఉంటాయి.

పాలక్ బ్రెడ్ బజ్జీ


PALAK-BREAD-BAJJI
కావాల్సినవి :
బ్రెడ్ ముక్కలు : 5
శనగపిండి : ఒక కప్పు
పాలకూర : ఒక కప్పు
షాజీరా : అర కప్పు
ధనియాల పొడి : ఒక టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
కారం : ఒక టీస్పూన్
సోడా : ఒక టీస్పూన్
ఉప్పు, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 : బ్రెడ్ ముక్కల చివర్లను కట్ చేసి పక్కన పెట్టాలి. పాలకూరను కొద్దిగా వేయించి పేస్ట్ చేయాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో శనగపిండి, పాలకూర పేస్ట్, షాజీరా, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, సోడా, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఒక్కో బ్రెడ్ ముక్కను తీసి శనగపిండి మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేయాలి. కరకరలాడే పాలక్ బ్రెడ్ బజ్జీ రెడీ!

ఆలూ బజ్జీ


Potato-Fritters---Aloo-Ba
కావాల్సినవి :
ఆలుగడ్డలు : 3
బియ్యంపిండి : అర కప్పు
శనగపిండి : 2 కప్పులు
కారం : ఒక టీస్పూన్
షాజీరా : అర టీస్పూన్
అల్లం,
వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
చాట్ మసాలా :
ఒక టేబుల్‌స్పూన్
బేకింగ్ సోడా : చిటికెడు
ఉప్పు, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 :ఒక గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, షాజీరా, అల్లం, వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా, కారం, కొద్దిగా నూనె, నీళ్లు పోసి కలుపాలి.
స్టెప్ 2 :ఆలుగడ్డల చెక్కు తీసి గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ 3 :కడాయిలో నూనె పోసుకొని వేడి చేయాలి. ఆలుగడ్డలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
స్టెప్ 4 : పై నుంచి చాట్ మసాలా వేసుకొని లాగిస్తే యమ టేస్టీగా ఉంటాయి ఆలూ బజ్జీలు!

స్వీట్ బనానా బ్రెడ్ బజ్జీ


SWEET-BANANA-BREAD-BAJJI
కావాల్సినవి :
బ్రెడ్ ముక్కలు : 2, జామ్ : అర కప్పు, క్రీమ్ చీజ్ : ఒక టేబుల్‌స్పూన్, అరటిపండు : 1, కోడిగుడ్లు : 2, పాలు : ఒక టేబుల్‌స్పూన్, వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్, బట్టర్ : అర టీస్పూన్, చక్కెర : 2 టేబుల్‌స్పూన్స్ , మైదా : 5 టేబుల్‌స్పూన్స్, బేకింగ్ పౌడర్ : అర టీస్పూన్, చాక్లెట్ సాస్ : ఒక టేబుల్‌స్పూన్, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 : బ్రెడ్ ముక్కలకు జామ్ రాయాలి. పైన క్రీమ్ చీజ్ వేయాలి.
స్టెప్ 2 : అందులో ఒక బ్రెడ్ ముక్కను తీసుకొని దాని మీద అరటి ముక్కలను వేయాలి. ఆ తర్వాత బ్రెడ్‌ని సన్నని ముక్కలుగా కట్ చేయాలి. దీని మీద మరో బ్రెడ్ పెట్టి ఒత్తాలి.
స్టెప్ 3 : ఇప్పుడు కోడిగుడ్లలోని పచ్చసొనలను, తెల్ల సొనలను వేరు చేయాలి. తెల్ల సొనని గిలకొట్టి పక్కన పెట్టాలి.
స్టెప్ 4 : మరొక గిన్నెలో పచ్చసొన, పాలు, వెనీలా ఎసెన్స్, బటర్, చక్కెర, మైదా, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపాలి. దీంట్లో తెల్లసొన మిశ్రమం కూడా వేయాలి.
స్టెప్ 5 : ఈలోపు కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. సన్నగా కట్ చేసిన బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేయాలి.
సంజయ్ తుమ్మ సెలబ్రిటీ చెఫ్

1048
Tags

More News

VIRAL NEWS