ఫ్యాన్‌గాలితో అనారోగ్యం!


Tue,August 7, 2018 01:20 AM

Fan
ఫ్యాన్.. ఇంట్లో కనీస అవసరం. చాలామందికి ఫ్యాన్ లేకుంటే అసలు నిద్రే పట్టదు. కొందరి ఇండ్లలో అవసరం లేకున్నా ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అయితే ఫ్యాన్ వేసుకొని నిద్రపోతే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఫ్యాన్ వేసుకొని నిద్రపోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. న్యూయార్క్‌కు చెందిన లెనోక్స్ హిల్ హాస్పిటల్‌లో సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ లెన్ హోరోవిడ్జ్ ఈ అంశంపై అధ్యయనం చేశారు. ఫ్యాన్ వేసుకొని నిద్రపోవడమనే అలవాటు గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఫ్యాన్ వేసుకొని నిద్ర పోవడం అనేది మరీ భయపడుతున్నంత ప్రాణాంతకం కాదుగానీ.. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం రెగ్యులర్‌గా ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం. అప్పుడు గదిలో ఫ్యాన్ గాలికి మన నోరు, ముక్కులో నుంచి తేమ ఆవిరైపోయి అవి పొడిబారి పోతాయి. దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడతాయి. దానికితోడు గదిలో ధూళి లేచి అది ముక్కు ద్వారా శరీరంలోకి చేరి కొన్ని ఎలర్జీలకు దారితీస్తుంది. చల్లటిగాలి వల్ల మెడ కండరాల్లో అతి సంకోచాలు ఏర్పడి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఫ్యాన్ మన ముఖానికి అభిముఖంగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్స్ అమర్చుకుంటే ఏ సమస్యా ఉండదని సూచిస్తున్నారు.

76
Tags

More News

VIRAL NEWS