ఫైల్స్ డిలీట్ అయ్యాయా?


Tue,July 31, 2018 11:18 PM

పొరపాటుగానో, మనకు తెలియకుండానో కొన్నిసార్లు ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అవుతుంటాయి. వాటిని తిరిగి పొందడం ఎలాగో తెలియక కొద్దిసేపు బాధపడి మన ప్రాప్తం ఇంతేలే.. అని వదిలేస్తాం. కానీ.. టెక్నాలజీ ఇప్పుడు డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి ఇస్తుంది.
smart-phones
డిలీట్ అయిన డేటాను తిరిగి పొందడానికి మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్ అనే సాప్ట్‌వేర్ ద్వారా మీరు కోల్పోయిన డేటాను తిరిగి పొందవచ్చు. ఏ ఫోన్‌లో అయితే ఫైల్స్ డిలీట్ అయ్యాయో.. ఆ మొబైల్‌ను కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. ఆ కంప్యూటర్‌కి ముందుగానే మొబికిన్ డాక్టర్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉంచాలి. మీ మొబైల్‌ను కంప్యూటర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మొబైల్‌లో డిలీట్ అయిపోయిన ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని రిస్టోర్‌లో పెట్టుకోవాలి. రీస్టోర్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. తరువాత రీస్టోర్ చేసిన డేటా తిరిగి మొబైల్‌లోకి వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, మీడియా ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ఇలా సుమారు 8 రకాల ఫైల్స్‌ను రికవరీ చేసుకోవచ్చు. రెండువేల రకాల ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది.

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles