ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఎఫ్‌డీల కన్నా మేలు


Fri,August 3, 2018 11:39 PM

image
ఇటీవలి కాలంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తరచుగా మారుస్తున్నాయి. సీనియర్ సిటీజన్లు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతో సంతృప్తిగా లేరు. దీంతో భద్రతతో పాటు ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడిని ఇచ్చే సాధనాలకోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. నిజం చెప్పాలంటే ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్‌ఎంపీ) మ్యూచువల్ ఫండ్లు ఆఫర్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాంటివి. చాలా మంది ఫిక్సడ్ డిపాజిట్ కు బదులుగా వీటిని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్లకన్నా కాస్త ఎక్కువ రాబడి అవకాశం ఉంది. అలాగే ఎప్పకప్పుడు మారే బ్యాంక్ డిపాజిట్ల వడీ రేట్ల మాదిరిగా కాకుండా ముందుగానే ఒక వడ్డీ రేటు గరిష్టంగా ఉందనుకున్నప్పుడు ఆ వడ్డీ రేటును లాక్ ఇన్ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
AFD1

ఇంతకీ ఎఫ్‌ఎంపీ అంటే..

ఒక నిర్ణీత కాలపరిమితితో కూడిన క్లోజ్ ఎండెడ్ డెట్ ఫండ్స్ ఇవి. ఈ కాలపరిమితి ఒక నెల రోజుల నుంచి ఐదేండ్ల వరకూ ఉండవచ్చు. ఇందులో మూడేండ్లకు మించిన కాలపరిమితికి మదుపు చేస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా ఉండదు. అందుకే ఇందులో మదుపు చేసేవారంతా మూడేండ్లకు మించి చేయగలిగితేనే బెటర్. నిర్ణీత మెచ్యూరిటీ సమయంలో మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడులను అందించే ఈ ఎఫ్‌ఎంపీలు ప్రధానంగా నిధులను రుణ సాధనాల్లో మదుపు చేస్తాయి.


ఎఫ్‌ఎంపీలు ఎక్కడ మదుపు చేస్తాయంటే..

సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లు (సీడీ), కమర్షియల్ పేపర్స్ (సీపీ), మనీ మార్కెట్ సాధనాలు, నిర్ణీత కాలపరిమితి ఉండి ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో మదుపు చేస్తాయి. ఇవి షేర్లలో మదుపు చేయవు.


లాభం ఏమిటీ?

ఎఫ్‌ఎంపీలలో మదుపు చేయడం వల్ల ప్రధానంగా రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి వడ్డీ రేట్లలో ఒడిదుడుకులతో సంబంధం లేకుండా రాబడిని ఇవ్వడం అలాగే టాక్స్ మినహాయింపును కూడా పొందే వీలుండడం. నిజానికి ఇవి ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చుకుంటే పన్ను తర్వాతి రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉన్నందువల్ల లిక్విడ్, అల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ కన్నా ఎక్కువ రాబడిని ఇస్తాయి. ఎఫ్‌ఎంపీలను మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేయాలని కనుక లావాదేవీల ఖర్చు కూడా మిగతా వాటితో పోల్చితే తక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీలకు అనుగుణంగా ఐదు రకాల స్థిరాదాయ సాధానాల్లో మదుపు చేస్తారు. ఎఫ్‌ఎంపీ కాలపరిమితిని బట్టి ఆకాలానికి మెచ్యూరిటీ అయ్యే సాధానాల్లోనే ఫండ్ మేనేజర్ మదుపు చేస్తారు. దీంతో ఎఫ్‌ఎంపీ మీద ఎంత రాబడి రావచ్చునో సూచనప్రాయంగా ముందుగానే తెలుస్తుంది.


ఎఫ్‌ఎంపీల్లో ప్రతికూలాంశాలు

ఈ పథకాలు క్లోజ్ ఎండెడ్ ఫండ్లు కనుక లిక్విడీటీ లేకపోవడం ప్రధాన ప్రతికూలాంశం. ఒకవేళ అవి స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్టయినా వాటిలో ట్రేడింగ్ చాలా చాలా పరిమితంగా జరుగుతుంది. అందుకే మెచ్యూరిటీ వరకూ హోల్డ్ చేయగలిగితేనే వీటిని కొనుగోలు చేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కచ్చితమైన గ్యారంటీ రిటర్నులు ఉంటాయి. అయితే ఎఫ్‌ఎంపీలలో రాబడులు సూచనప్రాయంగా ఉంటాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎఫ్‌ఎంపీల ఇష్యూలు

AFD2

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles