ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు..


Fri,August 17, 2018 11:50 PM

వడ్డీరేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు పరపతి సమీక్షల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడంతో డిపాజిట్లపై, రుణాలపై చెల్లించే రేట్లు కూడా పెరుగడంతో ఇన్వెస్టర్ల పంటపండింది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచకముందు కూడా ప్రధాన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడానికి మొగ్గుచూపడం కూడా విశేషం. దీంతో పెట్టుబడిదారులు అధిక స్థాయిలో రాబడులు పొందారు. నిధుల ప్రవాహం పుంజుకున్నది.. వీటితోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా అధికమయ్యాయి. వడ్డీరేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని కీలక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.. అవే ఇవి..
deposit

అధిక రిటర్నులు

పెట్టుబడిదారులకు తమ రిటర్నులు పంచాయా లేదా అనే అంశాన్ని కీలకంగా పరిగణిస్తారు. ముఖ్యంగా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు ఎంత ఉన్నది..తక్కువగా ఉన్నదా లేదా ఎక్కువ ఏయే బ్యాంకుల్లో ఉన్న సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ఆ తర్వాతనే ఎక్కడ డిపాజిట్ చేసేదానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అతిపెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న స్థాయి బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుండటంతో పెట్టుబడిదారులు వీటిలో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటిలో 1-2 శాతం అధిక వడ్డీ లభిస్తుండటమే ఇందుకు కారణం. ఐదేండ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై పలు బ్యాంకులు 7.75 శాతం నుంచి 8.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులే కాక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్), హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీఎస్), కార్పొరేట్లు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఖాతాలు తెరుచుకునే అవకాశం కూడా ఉన్నది. ఆయా సంస్థల వడ్డీరేట్లు పలు బ్యాంకుల కంటే అధికంగా ఉండటం విశేషం.

ఈ సంస్థల డిపాజిట్ల కాలపరిమితి ఏడాది నుంచి ఐదేండ్ల వరకు ఉన్నాయి. 3-5 ఏండ్లలోపు డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు అధికంగా వడ్డీని చెల్లిస్తున్నాయి ఆర్థిక సేవల సంస్థలు. ఉదాహరణకు ఎన్‌బీఎఫ్‌సీలు సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే దానికంటే 0.35 శాతం అధికంగా. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏండ్లకు పైబడి ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్‌ను కల్పిస్తున్నాయి. అలాగే టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు తగ్గట్టుగా బ్యాంకులు తమ పంతాను మార్చుకుంటున్నాయి. శాఖకు వచ్చి డిపాజిట్లు చేసే ఒపిక లేని వారికి కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిలో ఎన్‌బీఎఫ్‌సీఎస్, హెచ్‌ఎఫ్‌సీఎస్, కార్పొరేట్లు ముందువరుసలో ఉన్నాయి. ఇందుకోసం ప్రకటనలను ఆశ్రయిస్తున్నాయి.

చక్రవడ్డీతో అధికం

డిపాజిట్లకు చక్రవడ్డీ రూపంలో అధిక రిటర్నులు లభిస్తున్నాయి. ఉదాహరణకు లక్ష రూపాయలను ఐదేండ్లపాటు 7 శాతం వడ్డీకి డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడిదారుడికి రూ.140,255.17 లభించనున్నాయి. ఈ చక్రవడ్డీతో కలుపుకుంటే ఇవి రూ.1,41,059.88కి చేరుకోనున్నాయి. అతిపెద్ద బ్యాంకులు తమ డిపాజిట్లపై నెల లేదా త్రైమాసిక కాలంలో ఈ చక్రవడ్డీని చెల్లిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న పోటీతో పలు సంస్థలు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దీంట్లోభాగంగా చక్రవడ్డీని తెరపైకి తీసుకొచ్చాయి ఆయా సంస్థలు. డిపాజిట్లపై వడ్డీ ఆఫర్‌తోపాటు పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించే విధంగా ఆర్థిక సంస్థలు చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు.

క్రెడిట్ రేటింగ్ కూడా కీలకం

డిపాజిట్లపై క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇచ్చే ర్యాంక్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నది.
FIXED
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలైన క్రిసిల్, ఇక్రాలు రేటింగ్‌కు ఇప్పుడు క్రియాశీలకంగా మారాయి. ఉదాహరణకు క్రిసిల్..పలు డిపాజిట్ పథకాలకు ఎఫ్‌ఏఏఏ (అత్యధిక భద్రత), ఎఫ్‌ఏఏ(అధిక భద్రత), ఎఫ్‌ఏ(తగినంత భద్రత), ఎఫ్‌బీ(సరిపోని భద్రత), ఎఫ్‌సీ(అధిక ప్రమాదం), ఎఫ్‌డీ(డిఫాల్ట్) ఉన్నట్లు ర్యాంకులు ఇస్తున్నాయి. వీటిలో పెట్టుబడిదారులు తమ డిపాజిట్లను అధిక భద్రత ర్యాంక్ ఇచ్చిన వాటిలోనే పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే అధిక ప్రమాదం ఉన్నవాటిలో పెడితే ఉన్నవి కోల్పోయే ప్రమాదం ఉన్నది. తొలి మూడు ర్యాంకులు కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయవచ్చును.

స్వల్పకాలిక అవసరాలకు ఇదే ఉత్తమం

స్వల్పకాల అవసరాలకోసం పొదుపు చేయాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లే నయం. ఎందుకంటే ఏదైన అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం పడిందనుకో ఫిక్స్‌డ్ డిపాజిట్లను వెంటనే ఉపసంహరించుకునే అవకాశం పెట్టుబడిదారుడికి ఉంటుంది. ముందుగా ఏడాది పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అత్యవసరంగా ఏదైన ప్రమాదం లేదా ఇంట్లో శుభకార్యం లేదా ఉద్యోగం పోయిందో లేదా ఇతర అవసరాలకోసం ఆయా బ్యాంకు లేదా ఆర్థిక సేవల సంస్థల వద్దకు వెళ్లి ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాల్సి ఉంటుంది. వీలైనంత తొందరలో వాళ్లు ఈ డిపాజిట్లను చెల్లించే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా పరిమితి ఉంటుంది. పెట్టుబడులు, సంపాదన పెరుగుట విషయంలో మాత్రం ఎఫ్‌డీలు పనికిరానిదని చెప్పవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తున్నది. కానీ సీనియర్ సిటిజన్లకు మాత్రం ఎఫ్‌డీలపై ఆర్జించే రూ.50 వేల వరకు పన్ను మినహాయింపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన వారు 30 శాతం స్లాబ్‌లో, 7 శాతం డిపాజిట్లపై చెల్లించాల్సి ఉంటుంది. అత్యధిక బ్యాంకులు డిపాజిట్లపై ఉపసంహరణను నెట్ బ్యాంకింగ్ ద్వారా అందించడానికి మొగ్గుచూపుతన్నాయి. పేపర్ వర్క్, ఇతర ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ కార్పొరేట్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు ఇలాంటి నెట్ బ్యాంకింగ్ ద్వారా డిపాజిట్ల ఉపసంహరణ అవకాశాలు కల్పించడం లేదు.
-అధిల్ శెట్టి, బ్యాంక్‌బజార్.కామ్ సీఈవో

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles