ఫామ్ 16-ఫామ్ 26 ఏఎస్ తేడాలను గమనించండి


Sat,July 21, 2018 01:37 AM

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు వేగంగా ముంచుకొస్తున్నది. మారిన నిబంధనలతో రిటర్ను దాఖలు చేయడంలో కాస్త ఆలస్యం చేసినా, చిన్ని పొరపాట్లు చేసినా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. పొరపాటుకు అవకాశం ఉన్న ముఖ్యమైన అంశం టీడీఎస్ సర్టిఫికేట్ (ఫామ్16,16ఏ)కు టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్ (26 ఏ ఎస్) మధ్యతేడాలు. రిటర్నులను దాఖలు చేసే సమయంలో వీటిని జాగ్రత్తగా గమనించాలి. లేదంటే చాలా కష్టాలే పడాల్సి ఉంటుంది.
form

టీడీఎస్ సర్టిఫికెట్ అంటే?

ఆదాయ వనరు దగ్గరే పన్నును మినహాయించుకునే (టీడీఎస్) సంస్థలన్నీ ఈ సర్టిఫికెట్‌ను ఇస్తాయి. అందులో మినహాయించుకున్న పన్ను మొత్తాల వివరాలుంటాయి. ఫామ్ 16 లో వేతన ఆదాయం నుంచి పన్నును మినహాయిస్తే పని చేసే సంస్థ ఇచ్చేది. ఫామ్ 16A అంటే వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై పన్నును మినహాయించుకుని ఇచ్చేది. ఉదాహరణకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయంపై పన్నును మినహాయించుకని బ్యాంకులు ఫామ్ 16 ఏ ను ఇస్తాయి.

ఫామ్ 26 AS అంటే...

వివిధ సంస్థల నుంచి పన్ను మినహాయించుకుని ఆదాయం వస్తున్నప్పుడు, ఆ వివరాలన్నీ అన్నీ ఒకేచోట చేర్చి ఇచ్చేదే పామ్ 26AS. దీన్ని నేరుగా ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌నుంచి పొందవచ్చు.

ఫామ్ 26 AS లో జరిగే పొరపాట్లు

మీఆదాయంపై పన్నును మినహాయించుకుని చెల్లింపు జరిపినప్పటికీ, ఆ సంస్థ ప్రభుత్వానికి చెలించకపోవడం వల్ల మీ టీడీఎస్ వివరాల్లో తేడా రావచ్చు. పాన్ నంబర్‌ను లేదా ఆసెస్‌మెంట్ సంవత్సరాన్ని తప్పుగా రాయడం వల్లనో ఫామ్ 26 AS పొరపాట్లు జరగవచ్చు.
formTEDS

టీడీఎస్ సర్టిఫికెట్‌కు ఫామ్ 26 AS తేడా ఉంటే

కొన్ని సందర్బాలలో టీడీఎస్ సర్టిఫికెట్స్‌లోని వివరాలకు ఫామ్ 26 AS లోని వివరాలకు మధ్య తేడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మీరు పనిచేస్తున్న సంస్థ ఇచ్చిన ఫామ్16 లోని వివరాలను సరిచూసుకోండి. టీడీఎస్ మినహాయించినప్పటికీ చెల్లించకపోతే ఫామ్ 26 AS లో కనిపించదు. మినహాయించిన సంస్థ టాన్ నంబర్ లేదా వ్యక్తి పాన్ నంబర్‌లు తప్పుగా రాసినా, చలాన్ వివరాలు లేకపోయినా, టీడీఎస్ మొత్తాన్ని తప్పుగా రాసినా ఈ తేడాలు కనిపిస్తాయి.

ఎలా సరిదిద్దడం

పాన్ నంబర్ తప్పుగా రాస్తే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఆలస్యం అవుతుంది. ఫైలింగ్‌కు ముందే వీటిని సరిచూసుకోవాలి. మీ పన్నును మినహాయించిన సంస్థలను వెంటనే మళ్లీ టీడీఎస్ సవరించి ఇవ్వమని కోరాలి. ఒకవేళ వడ్డీ ఆదాయంపై తప్పు టీడీఎస్ ఉంటే బ్యాంకర్‌ను దాన్ని సరిచేసి ఇవ్వమనికోరవచ్చు. అందుకే టీడీఎస్ సర్టిఫికెట్ ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిగ్గా ఉండేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు పని చేస్తున్న సంస్థ లేదా బ్యాంకర్ మీకు ఫామ్ 26 AS ఇస్తున్నట్టయితే దాని సాధికారతను ఒకసారి పరిశీలించండి. తెల్ల కాగితం మీదనో లేదా కంపెనీ లేదా బ్యాంక్ లెటర్‌హెడ్ మీదనో ఇచ్చే ఫామ్ 26 AS చెల్లుబాటు కాదు. ట్రేసెస్ పోర్టల్ నుంచి మాత్రమే పొంది ఉండాలి.

630
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles