ఫండ్లలోకి పెట్టుబడుల వరద


Fri,December 14, 2018 11:02 PM

Mutual-funds
మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ల కంటే మ్యూచువల్ ఫండ్లు లాభదాయకంగా ఉండటం, ఎలాంటి ఆందోళన చెందే అవకాశాలు లేకపోవడంతో ఈ రంగంలో నిధులు గుమ్మరిస్తున్నారు పెట్టుబడిదారులు. గడిచిన నెలలో వివిధ పథకాల ద్వారా ఫండ్లలోకి రూ.1.4 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గడిచిన కొన్ని నెలలుగా నిర్లిప్తంగా ఉన్న పెట్టుబడులు ఈ మధ్యనే పెరిగాయని, ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు తమకు లాభం చేకూర్చే వాటివైపు మొగ్గుచూపడం ఇందుకు కారణమని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్‌ఎస్ వెంకటేశ్ తెలిపారు. మొత్తంమీద రాబడులు, ఏయూఎంలు పెరుగుతున్నాయన్నారు. గడిచిన నెలలో 1.5 లక్షల మంది పెట్టుబడిదారులు ఈ రంగంలోకి చేరారని, ఇది సానుకూల అంశమని ఆయన పేర్కొన్నారు. యాంఫీ విడుదల చేసిన నివేదిక ప్రకారం నవంబర్ నెలలో రూ.1,42,359 కోట్ల పెట్టుబడులు ఫండ్లలోకి వచ్చాయి.

అక్టోబర్‌లో వచ్చిన రూ.35,529 కోట్లతో పోలిస్తే ఐదురెట్లు అధికం. సెప్టెంబర్‌లో ఈ రంగం నుంచి రూ.2.3 లక్షల కోట్లమేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అప్పుల్లో కూరుకుపోయిందన్న వార్తలు గుప్పుమనడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రతరమైంది. దీంతో తమ ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కితీసుకున్నారు. తాజాగా వచ్చిన పెట్టుబడుల్లో ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన పొదుపు పథకాల్లో వచ్చాయి. ఇలా వచ్చిన వాటిలో లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.1.36 లక్షల కోట్లు రాగా, ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన పొదుపు పథకాల్లోకి రూ.8,400 కోట్లు, బ్యాలెన్స్ ఫండ్స్‌లోకి మరో రూ.215 కోట్లు వచ్చాయి.

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles