ప్లాస్టిక్ పాత్రలను శుభ్రంగా..!


Mon,September 3, 2018 11:32 PM

గాజు, స్టీల్ పాత్రలతో పోలిస్తే ప్లాస్టిక్ పాత్రలకు జిడ్డు, వాసన, మరకలను పోగొట్టడం కాస్త కష్టమైన పనే. ఇప్పుడు ప్లాస్టిక్ పాత్రలను శుభ్రంగా కడిగే టెక్నిక్ తెలుసుకుందాం.
plastic
-నిమ్మకాయను సగానికి కోసి ప్లాస్టిక్ పాత్రల లోపలి భాగంలో రుద్దాలి. తరువాత బేకింగ్ సోడాతో రుద్ది నీటితో కడిగి ఆరబెడితే చాలు ఉన్న మరకలు పోయి, దుర్వాసన రాకుండా ఉంటాయి.
-దుర్వాసన వచ్చే ప్లాస్టిక్ పాత్రల్లో న్యూస్ పేపర్లను పెట్టి మూత పెట్టాలి. అలా ఒక రోజంతా పెట్టి తరువాత సబ్బు నీటితో కడిగితే దుర్వాసన పోతుంది.
-వెనిగర్, నీటిని బాగా కలుపాలి. ఈ ద్రావణాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఒకరోజంతా ఉంచాలి. తరువాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ డబ్బాలో వచ్చే దుర్వాసన పోతుంది.
-బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని బట్టతో ప్లాస్టిక్ పాత్ర లోపలి భాగం తుడవాలి. కొంతసేపటి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే పాత్రకున్న జిడ్డు తొలిగిపోతుంది.
-క్లోరిన్ బ్లీచ్, నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ పాత్రలో ఉంచాలి. 30 నిమిషాల తరువాత సబ్బు నీటితో కడిగితే ప్లాస్టిక్‌కు ఉన్న మరకలు పోతాయి.

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles