ప్రొస్టేట్ క్యాన్సర్‌కు పరీక్షలివే..!


Mon,March 19, 2018 11:20 PM

depressed-man
ఎవరికైనా 50 ఏళ్ల వయసు వచ్చే సరికి జీవన బాధ్యతలు మీదపడతాయి. కొంతమంది పురుషుల్లో సరిగ్గా అదే సమయంలో ప్రొస్టేట్ క్యాన్సర్ సమస్యలు మొదలవుతాయి. ఇతర బాధ్యతల్లో పడి ఆరోగ్యం పాడవుతోందన్న విషయాన్ని విస్మరిస్తే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అయితే క్యాన్సర్ లక్షణాలేవీ ముందుగా కనిపించవు. అందుకే చాలా సార్లు వ్యాధి బాగా ముదిరేదాకా ఏమీ తెలియదు. అయితే 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క పురుషుడు ఏటా ఒక్కసారైనా పీఎస్‌ఏ పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ఆదిలోనే అడ్డుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యాభై ఏళ్లు దాటిన కొంత మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ వయసు వారిలో ఈ సమస్య రాదని కాదు కానీ, వయసు పైబడిన వారిలో మాత్రం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి కేవలం పీఎస్‌ఏ అనే ఒక పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించే వీలుంది. 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు ఏటా ఒకసారి ఈ పీఎస్‌ఏ పరీక్ష చేయించుకుంటే సమస్యనుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఇదొక సాధారణ రక్తపరీక్ష ద్వారా తేలిపోయే పరీక్ష. ఎప్పుడో తెలిసే నాటికి అది శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకిపోయి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందు గుర్తిస్తే ఆ దశలో వైద్యచికిత్సలు అందించడం చాలా సులువు. ఆ దశలోనే సరైన చికిత్సలు అందితే క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది.

లక్షణాలు

మూత్ర విసర్జనలో ఏదో అడ్డుపడుతున్నట్టు అనిపించడం, మంట అనిపించడం, మూత్రం కొద్ది క్షణాలైనా ఆపుకోలేకపోవడం, మూత్రం వచ్చినట్టే వచ్చి రాకపోవడం, లేదా రావడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి లక్షణాలులు ఎక్కువ మందిలో కనిపిస్తాయి. అలాఏగ చాలా ఎక్కువ సార్లు మూత్రం రావడం, ప్రత్యేకించి రాత్రివేళ ఏ మూడు నాలుగు సార్లో నిద్రలేవాల్సి వస్తుంది. మూత్రం ధార సన్నబడటం, దూరంగా కాకుండా అక్కడే పడటం, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షనాలు కూడా ఉంటాయి. మూత్ర విసర్జనలో పలురకాల అంతరాయాలు ఏర్పడి ఒక దశలో కిడ్నీలు పనిచేయలేని స్థితి కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షక్షాలు అయితే ఇవన్నీ క్యాన్సర్‌తో సంబంధం లేని బినైన్ ప్రొస్టేట్ హైపర్‌ట్రోపీలో కూడా ఉంటాయి. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన చాలా మంది పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే సాధారణ పీఎస్‌ఏ పరీక్ష ఈ రెండింటినీ వేరు చేస్తుంది.

మూడు రకాల వైద్యం

ఈ క్యాన్సర్లు ప్రొస్టేట్ గ్రంధికే పరిమితమైనది. ఎముకలకు కూడా పాకింది. ప్రొస్టేట్ మొత్తంగా వ్యాపించినా, ఎముకలకు పాకనిది అంటూ ప్రొస్టేల్ క్యాన్సర్లు మూడు రకాలుగా ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ ప్రొస్టేట్ గ్రంధికి మాత్రమే పరిమితమైతే రాడికల్ ప్రొస్టేటెక్టమీ, లేదా రాడికల్ రేడియోథెరపీ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఇవే కాకుండా నర్వ్స్ బేరింగ్ ప్రొస్టెక్టమీ అని కూడా ఉంటుంది. ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు, వీర్యం వెనక్కి వెళ్లిపోవడం వంటి లైంగిక సమస్యలకు ఈ చికిత్స చేస్తారు. సమస్య ప్రారంభంలోనే గుర్తిస్తే వీటి నుంచి రోగి సంపూర్ణంగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ నర్వ్ బేరింగ్ ప్రొస్టెటెక్టమీని లాపరోస్కోపిక్ విధానంలో చేస్తున్నారు. అలాగే రోబోల సహాయంతో కూడా చేస్తున్నారు. వీటి ద్వారా సర్జరీ మరింత సమర్థవంతంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సర్ కేవలం ప్రస్టేట్ గ్రంధికి పరిమితమై ఉన్నపుడు అనుసరించే విధానాలు. అయితే రాడికల్ రేడియో థెరపీతో కూడా అంతే సమానంగా ఫలితాలు వస్తున్నాయి.

ఆధునికంగా వచ్చిన ఐఎమ్‌ఆర్‌టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియో థెరపీ) లేదా ఐజీఆర్‌పీ (ఇమేజ్ రేడియో థెరపీ) విధానాల్లో రేడియేషన్‌ను సరిగ్గా ప్రొస్టేట్ గ్రంథి మీద కేంద్రీకృతం చేస్తారు. అలా చేయడం వల్ల శస్త్ర చికిత్సతో సమానంగా ఫలితాలు వస్తున్నాయి. కాకపోతే రేడియేషన్ 30 రోజుల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానాలతో ఒకటి రెండు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అందేకే ఇటీవలి కాలంలో సైబర్ నైఫ్ అనే కొత్త రేడియోథెరపీ వచ్చింది. దీనితో కేవలం రెండు నుంచి ఐదు దఫాలకే రేడియేషన్ పూర్తవుతుంది. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నపుడు ఈ విధానం బాగా తోడ్పడుతుంది. ప్రొస్టేట్ గ్రంధికే పరిమితమైన క్యాన్సర్ ఒక తీవ్రస్థాయికి చేరినపుడు రేడియేషన్‌తో పాటు హార్మోన్ చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలు టెస్టోస్టిరాన్ హార్మోన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్లే ఈ హార్మోన్ నియంత్రణా చిక్తిసలు ఇందులో భాగమయ్యాయి. నిజానికి, శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని ఆపగలిగితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలు నియంత్రించడమే అవుతుంది.

కొత్త దారులు వెతికినా

ఒకవేళ క్యాన్సర్ అప్పటికే ఎముకలకు కూడా పాకీ ఉంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ శరీరంలోంచి పూర్తిగా తీసివేయాలి. ఈ హార్మోన్ వృషణాల్లోనే కాకుండా, ఎడ్రినల్ గ్రంధిలో కూడా ఉత్పన్నమవుతుంది. శరీరంలోని కొవ్వులోంచి కూడా కొంత మేరకు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వృషణాల్లోని టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి పదార్ధాన్ని తీసివేయడాన్ని బైలేటరల్ సబ్ క్యాప్సూలా ఆర్కిడెక్టమీ అంటారు. కొందరికి వృషణాలను గానీ, చివరికి వాటిలోని టెస్టోస్టిరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేసే పదార్థాన్ని గానీన తీసివేయడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఎల్‌హెచ్‌ఆర్‌మెచ్ అనలాగ్స్ ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా శస్త్రచికిత్స లేకుండానే వృషణాల పనితనాన్ని పూర్తిగా నిలువరించే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే వాటిని యాంటిఆండ్రోజన్ల సహాయంతో నియంత్రిస్తాం. దీన్నే టోలట్ ఆండ్రోజన్ సహాయంతో నియంత్రిస్తాం. దీన్నే టోటల్ ఆండ్రోజన్ బ్లాకేజ్ అంటారు. ఇలా చేయడం వల్ల పీఎస్‌ఏ తగ్గిపోతుంది. అయితే కొంత కాలం తర్వాత కొందరిలో పీఎస్‌ఏ మళ్లీ పెరగడం మొదలవుతుంది.

దానికి క్యాన్సర్ కణాలు కొత్త విధానాల్లో పెరగడం ప్రారంభించడమే కారణం. హార్మోన్ నియంత్రణ తర్వాత మళ్లీ పిఎస్‌ఏ పెరగడాన్ని, హార్మోన్ రిఫ్రాక్టరీ ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ఈ పరిణామం కొందరిలో ఆరునెలలకే మొదలు కావచ్చు. మరికొందరిలో రెండేళ్ల వరకు సమయం పట్టవచ్చు. ఈ స్థితిలో పీఎస్‌ఏ మళ్లీ పెరుగుతుంది. అప్పుడిక కీమోథెరప ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో అంత ఫలితం కనిపించకపోతే అంతకన్నా శక్తివంతమైన కొన్ని ఆధనికమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ థెరపీతో అంత ఫలితం కనిపించపోతే, అంతకన్నా శక్తివంతమైన కొన్ని ఆధునికమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ఎముకలకు పాకితే సహజంగానే, అవి బాగా బలహానమవుతాయి. అప్పుడు ఎముకలను శక్తివంతం చేసే కొన్ని ఇంజక్షన్లు నెలకు ఒక్కటి చొప్పున ఇస్తాం. ఇంజక్షన్ల స్థానంలో ఇటీవల కొన్నిమాత్రలు కూడా వచ్చాయి. వీటితోపాటు నొప్పి తగ్గడానికి కొందరికి రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా ఆధునిక వైద్య విధానాలలో ప్రస్టేట్ క్యాన్సర్‌చికిత్సా కాలం నేడు బాగా తగ్గిపోయి, జీవిత కాలం గణనీయంగా పెరుగుతోంది.
mohana-vamshi

860
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles