ప్రావిడెంట్ ఫండ్‌లోనూ ఇక పెట్టుబడి ఆప్షన్లు


Sat,July 28, 2018 12:40 AM

product
ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్ర్కైబర్లు ఇక నుంచి తమ సొమ్మును ఎక్కడ మదుపు చేయాలో నిర్ణయించుకునే అవకాశం రాబోతున్నది. పీఎఫ్ అకౌంట్‌లోని తమ డబ్బును ఈక్విటీల్లోనా, రుణ సాధనాల్లోనా లేదా రెండింటిలోనూ మదుపు చేయాలనే ఆప్షన్‌ను కల్పించేందుకు కార్మిక శాఖ యోచిస్తున్నది. ఈ మేరకు ముసాయిదా నివేదికను ఒకదాన్ని రూపొందించింది. ఈ నివేదికను బట్టి పిఎఫ్ సబ్‌స్ర్కైబర్లు నాలుగా కేటగిరీలలో మదుపు చేయవచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీ పెట్టుబడులు, రుణ సాధనాలు, మనీ మార్కెట్ సాధనాల్లో మదుపు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. జాతీయ పెన్షన్ స్కీమ్ చేసే ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి తరహాలో పీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌ను కూడా రూపొందించాలని కార్మిక శాఖ యోచిస్తున్నది. పీఎఫ్ సబ్ స్ర్కైబర్లు ఈ నాలుగు కేటగిరీలలో ఎంతెంత మొత్తాన్ని మదుపు చేయాలో కూడా నిర్ణయించుకునే వీలు కల్పించాలన్నది ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకు సంబంధించి వివిధ వర్గాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 50 శాతం వరకు నిధులను ప్రభుత్వ సెక్యూరిటీలలో, 45 శాతం నిధులను రుణ సాధనాల్లో మదుపు చేసే వీలుంది. అలాగే ఈక్విటీలలో 15 శాతం నిధుల వరకు మాత్రమే పెట్టుబడులు పెట్టవచ్చు.

187
Tags

More News

VIRAL NEWS