ప్రమాదాలు.. ప్రథమ చికిత్స!


Sat,September 8, 2018 11:25 PM

first-aid
పిల్లలు ఆటలాడుతున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయ్. ఒక్కోసారి పెద్దవి కూడా తగలొచ్చు. లేదా ఏవైనా పనులు, ప్రయోగాలు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కొన్ని గాయాలవుతుంటాయి. ఫలితంగా రక్తస్రావం అవుతుంటుంది. ఒక్కోసారి దవాఖానకు వెళ్లేటప్పటికి సమయం మించిపోతుంది కూడా. ఈ క్రమంలో చేయాల్సింది ప్రథమ చికిత్స. దీనివల్ల ప్రమాదాన్ని కొంతమేరకు ఆపవచ్చు. ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా కొన్ని ప్రమాదాలకు ప్రథమ చికిత్సలు ఎలా చేయాలో తెలుసుకుందాం.


ముక్కులో రక్తస్రావం!

Nosebleed
పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువగా గొడవపడుతూ కొట్లాటకు దిగుతారు. తోపులాటలో కిందపడుతారు. కొన్నిసార్లు ముక్కుకు బలంగా దెబ్బతగిలి రక్తం కారుతుంది. అప్పుడు బాధిత చిన్నారిని కదలకుండా ఉంచా లి. తలను అటు ఇటూ, మరీ ముఖ్యంగా వెనక్కి తిప్పకూడదు. ధరించిన దుస్తులు మెడకు గట్టిగా ఉంటే వదులు చేయాలి. ముక్కు చివర కొంతసేపు మూసి ఉంచితే రక్తం కారడాన్ని ఆపవచ్చు. మన బామ్మలు ఉల్లిపాయను కోసి ముక్కు దగ్గర ఉంచుతారు. దీనివల్ల రక్తం గడ్డకడుతుంది. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి.


కీటకాల వల్ల ప్రమాదం!

Insect-Bite-or-Sting
పిల్లలు చెట్ల కింద ఆడేందుకు మక్కువ చూపుతారు. అక్కడి కీటకాల భారిన పడుతుంటారు. చెట్ల మీద ఉండే గొంగళి పురుగులు, కందిరీగలు కుడితే చర్మం మీద దురద, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధను కలిగిస్తాయి. ప్రథమ చికిత్సగా గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. గొంగళి పురుగు పాకిన ప్రదేశంలో విభూది రాయాలి. దద్దుర్లు ఎర్రగా మారడం, ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడడం, పెదవులు నల్లబడడం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించాలి.


చేతులు కోసుకుంటే!

Cut-or-Scrape
పెద్దల నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి చిన్నారులు ప్రమాదానికి గురవుతుంటారు. ఇంట్లో వాడే కత్తులు, బ్లేడుల్లాంటి పరికరాలతో ఒక్కోసారి చర్మం కోసుకుపోతుంది. అలాంటప్పుడు తీవ్ర రక్తస్రావం అవ్వకుండా చల్లని నీటిలో తడిపిన బట్టను, గాయం తగిలిన చేతికి చుట్టాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐసు ముక్కలను బట్టలో కట్టి రక్తం కారుతున్న ప్రదేశంలో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారడం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే చేతిని పైకెత్తి పెట్టడం వల్ల కొంత ఫలితముంటుంది.


గాజు, సీసా పెంకులు గుచ్చుకుంటే!

Splinter-or-Glass
ఇంట్లో కిటికీ అద్దాలు, గాజులు గాలికి పగుల్తుంటాయి. పిల్లలు తిరుగడంలో గాజు ముక్కలు కాలికి గుచ్చుకుంటాయి. అవి ఎక్కువసేపు లోపలి భాగంలో ఉంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. గాజు గుచ్చుకున్న వెంటనే సబ్బుతో కడుగాలి. సబ్బును ఐప్లె చేసినపుడు గుచ్చుకున్న గాజును సలువుగా తీయవచ్చు. గాజును తొలిగించిన తరువాత వైద్యున్ని సంప్రదించి తగిన సూచనలు పాటించాలి.


కాలిన గాయాలకు!

burns
పిల్లలు నీటితో ఆడుకోవాలని ఒక్కోసారి వేడినీటిలో చేతులు పెట్టేస్తుంటారు. పెట్టిన వెంటనే లేత చర్మానికి బొబ్బలొస్తాయి. అప్పుడు.. కాలిన చేతులమీద నిదానంగా చన్నీళ్లను పోస్తూ ఉండాలి. తరువాత తడిపిన బట్టను కాలిన చేతిపై ఉంచాలి. చేతికి వచ్చిన బొబ్బలను చిదపకూడదు. వాటిని ఏమాత్రం కదిలించినా మచ్చలు పడే ప్రమాదముంది. డాక్టర్ వద్దకు చేరే వరకు ఈ పద్ధతిని పాటిస్తే పిల్లలకు కొంతమేరకు మంట తగ్గుతుంది. తర్వాత డాక్టర్ చెప్పిన మందులు వాడడం వల్ల పూర్తిగా నయం అవుతుంది.

673
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles