ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్!


Wed,September 7, 2016 01:31 AM

మగవారిలో కన్నా ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ. మరో ముఖ్య విషయం ఏంటంటే మీ వయసు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 39 సంవత్సరాల వయసు గల స్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి, 60 ఏళ్లు దాటితే ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోందని నిపుణుల అధ్యయనంలో తేలింది. మీ దగ్గరి బంధువులకు (అమ్మ, సోదరి, కూతురు) క్యాన్సర్ ఉంటే మీకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. మీకిదివరకే రొమ్ము క్యాన్సర్ ఉంటే అదే రొమ్ములో లేదా పక్క రొమ్ములో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతివారిలో రిస్కు ఎక్కువ.

ఈస్ట్రోజన్
రొమ్ముల్లోని కణాలను ఇది ఉత్తేజపరుస్తుంది. దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే దీన్ని నియంత్రించడం కొన్నిసార్లు మనచేతుల్లో ఉండదు. ఉదాహరణకు 12 ఏళ్ల కన్నా తక్కువ వయసులోనే నెలసరి ప్రారంభమై, 55 ఏళ్ల తరువాత వరకు కొనసాగడం అంటే దీర్ఘకాలం పాటు నెలసరి ఉంటే క్యాన్సర్ అవకాశం పెరుగుతుంది. అదేవిధంగా బయటి వాతావరణం నుంచి అంటే మాంసాహారంలోని హార్మోన్లు, ఇతర ఆహార పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేశాలు మన శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలిన పదార్థాలను విడుదల చేస్తాయి.

బిడ్డకు పాలు ఇస్తేనే మేలు
గర్భం రావడం, బిడ్డకు పాలివ్వడం నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. 30 ఏళ్లు పైబడే వరకు గర్భం ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భం రాని వాళ్లకు రిస్కు ఎక్కువ. దీర్ఘకాలం పాటు అంటే ఒకటిన్నర లేదా 2 సంవత్సరాల వరకు బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశం తక్కువ.
Breast-Cancer

ఈ మార్పులు కనిపిస్తే..
సాధారణంగా రొమ్ము క్యాన్సర్ కణితుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పి లేకుండాను, గట్టిగాను, సమానమైన అంచులు లేకుండా ఉంటాయి. మరికొన్నిసార్లు మెత్తగా, సమానంగా ఉంటాయి. కాబట్టి రొమ్ముల్లో ఏ మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. సాధారణంగా ఈ మార్పులు కనిపిస్తాయి.

రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్, నొప్పి, చనుమొనల్లో నొప్పి, అవి లోపలికి కుంగిపోవడం, ఎరుపెక్కడం, చనుమొనలు మొద్దుబారిపోవడం, పాలు కాకుండా ఇతర ద్రవాలు రావడం, చంకల కింది భాగంలో గడ్డలు ఉండడంఅయితే అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు. కాబట్టి డాక్టర్‌చే క్షుణ్ణంగా పరీక్ష చేయించుకోవడం మంచిది.
క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. 20 ఏళ్లు దాటిన స్త్రీలు నెల నెలా స్వయంగా పరీక్షించుకోవాలి. 20-40 లోపు వయసున్న వాళ్లు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటినవాళ్లు ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. 40-49 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి డిజిటల్ మామ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవాలి. ఇది డిజిటల్ రిసెప్టార్, కంప్యూటర్‌కి అనుసంధానించి ఆధునిక ఎక్స్‌రే. దీని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మమ్మోటోమ్ వంటి వాక్యూమ్ పవర్డ్ పరికరాల వల్ల అత్యంత కచ్చితంగా బయాప్సీ చేయవచ్చు.
vamshi

1878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles