ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్


Mon,April 15, 2019 11:09 PM

బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 60 యేండ్లు పైబడిన స్త్రీలలో ప్రతి 27మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
breast-cancer
ఎవరిలో ఎక్కువ: మగవారిలో కన్నా.. ఆడవారిలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.

ఏ వయసులో: వయస్సు అనేది మరొక పెద్ద క్యాన్సర్ కారకం. వయస్సు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అధ్యయనంలో తేలింది 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే వయస్సు 60 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.

వంశపారంపర్యం: మీ దగ్గరి బంధువులకు (అమ్మ, సోదరి, కూతురు) క్యాన్సర్ ఉన్న ట్లైతే మీకు కూడా వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది.

వ్యక్తిపరంగా : మీకు ఇదివరకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే అదే బ్రెస్ట్‌లో కానీ, పక్క బ్రెస్ట్‌లో కానీ మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతి స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత ఎక్కువ.

ఈస్ట్రోజన్ : ఈస్ట్రోజన్ హార్మోన్ స్థనాల్లోని కణాలను ఉత్తేజ పరుస్తుంది. దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్ హార్మోన్‌కు గురికావటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఈస్ట్రోజన్‌ను నియంత్రించడం అనేది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాలకన్నా తక్కువ వయస్సులోనే నెలసరి ప్రారంభం కావటం అదే విధంగా 55 సంవత్సరాల తరువాత బహిష్టు ఉడిగిపోవడం (మెనోపాజ్) అంటే దీర్ఘకాలం పాటు నెలసరి కొనసాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా అంత ఎక్కువే. అదే విధంగా బయటి వాతావరణం నుంచి శరీరంలోకి ప్రవేశించే ఈస్ట్రోజన్ ఉదాహరణకు మాంసాహారంలో ఉండే హార్మోన్‌లు, ఇతర ఆహారాలలో ఉండే పురుగు మందుల అవశేషాలు మన శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలిన అవశేషాలను విడుదల చేస్తాయి.

గర్భం స్థనపానం: గర్భం, స్థనపానం అనేవి నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. 30 సంవత్సరాలు పైబడే వరకు గర్భం ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భం ధరించని స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలం అంటే ఒకటి నుంచి ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాల వరకు పాలు ఇచ్చే తల్లులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అయితే అంత సుదీర్ఘ కాలం పాటు పాలు ఇవ్వడం ఈ రోజులలో సాధ్యం కావడం లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ (మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం) మన చేతిలో లేని పైన పేర్కొన్న అనేక రకాల కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు అదేదో మనం చేసిన తప్పిదం వల్ల వచ్చినట్లుగా కృంగిపోవటం తగదు. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పిలేకుండాను, గట్టిగాను, సమానమైన అంచులు లేకుండా ఉంటాయి. మరికొన్నిసార్లు మెత్తగాను, సమానంగాను ఉంటాయి, కాబట్టి స్థనాలలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవటం మంచిది. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ సోకినపుడు ఈ కింద పేర్కొన్న విధంగా మార్పులు సంభవిస్తాయి.

Mammography
లక్షణాలు : స్థనాలలో వాపు, ఇరిటేషన్, స్థనాలలో నొప్పి, చనుమొనలలో నొప్పి చనుమొనలు లోపలికి కృంగిపోవటం, ఎరుపెక్కటం, చనుమొనలు మొద్దుబారిపోవటం, చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంక కింది భాగంలో గడ్డలు ఉండటం మొదలైనవి.

డిజిటల్ మమోగ్రఫీ అంటే: ఇది డిజిటల్ రెసెస్టర్, కంప్యూటర్‌కి అనుసంధానించిన ఆధునిక ఎక్స్‌రే మెషీన్. దీనిద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇపుడు వస్తున్న ఆధునాతన డిజిటల్ మమోగ్రఫీ మెషిన్స్‌లో వచ్చే బెడ్ వల్ల కూర్చుని లేదా పడుకొని కూడా అత్యంత వేగంగా బయాప్సీనీ సేకరించవచ్చు. మోమ్మోమ్ వంటి వాక్యూమ్ పవర్డ్ పరికరాల వల్ల అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేయవచ్చు.

కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్

సోకిందని బాధ పడకుండా అత్యాధునిక శస్త్ర చికిత్సలను ఆశ్రయించి సమస్య నుంచి బయటపడాలి.

అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు

అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు. డాక్టర్‌తో క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని నిర్ధా రించుకోవటం మంచిది. క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం ఉత్తమమైన మార్గం. 20 సంవత్సరాలు దాటిన స్త్రీలు ప్రతి నెలా స్థనాలను స్వయంగా పరీక్షించుకోవాలి. 20-40 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవాలి. 40 సం.లు దాటిన స్త్రీలు ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకోవాలి. 40-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకు డిజిటల్ మమోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవాలి. 50 ఏండ్లు పైబడిన స్త్రీలు ప్రతి సంవత్సరం మమోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి.
mohana-vamshi

258
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles