ప్యాలెస్ ఆన్ వీల్స్


Fri,August 24, 2018 02:25 AM

palace-on-wheels
భారతదేశపు మొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. లగ్జరీ ట్రైన్లలో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. రాజస్థాన్ రాజ్‌పుత్‌లు, గుజరాత్ రాజులు, హైదరాబాద్ నిజాములు, బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ వాడిన రైలు బోగీల థీమ్‌లతో చారిత్రక వైభవం ఉట్టిపడేలా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్థాన్ రాష్ట్ర పర్యాటక శాఖ- ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఈ రైల్లోని 14 బోగీలకు రాజస్థాన్‌లోని పద్నాలుగు సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. ఆర్నెల్ల ముందుగా బుకింగ్స్ అయిపోయే ఈ రైలుకు విదేశీ పర్యాటకులెక్కువ. 1991లో ఏసీ ఏర్పాటుచేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు.


palace-on-wheels2
సందర్శనీయ ప్రదేశాలు: ప్రతి బుధవారం ఢిల్లీ నుంచి ప్రయాణం మొదలవుతుంది. జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్, చిత్తోర్‌ఘడ్, సవాయి మదోపూర్ (రణతంబోర్ కోట, నేషనల్‌పార్క్), భరత్‌పూర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా.
ప్యాకేజీ: ఎనిమిది రోజుల ఈ ప్యాకేజీ ధర రోజుకు, ఒకరికి 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే 33 వేలు, ముగ్గురు గదిని పంచుకుంటే 45 వేలు ఛార్జ్ చేస్తారు. అక్టోబరు-మార్చి మధ్య ధరలు ఎక్కువ. మే, జూన్, జూలై నెలల్లో ఈ ట్రైన్ బంద్!

960
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles