పోషకాల పప్పు ధాన్యాలు


Wed,June 13, 2018 10:39 PM

పప్పు ధాన్యాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. గోధుమలు, బియ్యం, పాలు, మాంసాహారంతో సమానంగా వీటిని తీసుకోవచ్చు. పప్పుధాన్యాలను తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే..?
Nutrian-Collume
-పప్పు ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్, మైక్రో న్యూట్రిషియన్స్, ప్రొటీన్, విటమన్-బి వంటివి ఉంటాయి.
-వీటిల్లో తక్కువస్థాయిలో కొవ్వు, ఎక్కువ స్థాయిలో ఫైబర్ ఉంటుంది. కొవ్వులను నియంత్రించడానికి, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడుతాయి.
-వీటిల్లో ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం అధికంగా ఉంటాయి.
-ఇవి కొంచెం నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తాయి.
-పప్పు ధాన్యాల్లో తక్కువస్థాయిలో కేలరీలుంటాయి. అంటే వంద గ్రాముల పప్పు ధాన్యాల్లో 206-360 కేలరీలుంటాయి.
-వీటిల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్, ఫైబర్‌లు నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి.
-వీటిల్లో ఉండే ఐరన్ ప్రాణవాయువును శరీరమంతటా రవాణా చేయడానికి సహాయపడుతుంది.
-పప్పు ధాన్యాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, రక్తంలోని కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి.
-నానబెట్టిన పప్పు ధాన్యాల్లో శరీరానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
dr-mayuri-aavula

2469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles