పొంచి వున్న..చర్మవ్యాధులు!


Tue,February 26, 2019 01:29 AM

అబ్బబ్బ.. ఏం ఎండలు? ఏం ఉష్ణోగ్రతలు? ఆరంభమే ఇంత ఆందోళనా? ఉక్కిరి బిక్కిరి చేసే ఈ ఉష్ణోగ్రతలతో జాగ్రత్త. ముఖ్యంగా చర్మం. అందరి శరీర చర్మస్థితి ఒకేలా ఉండదు. మండే ఎండల్ని తట్టుకోలేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చర్మం.. దానితో చలగాటమాడే ఆ వ్యాధులేంటో తెలుసుకుందాం.
handskin
శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి.. శరీర ఉష్ణోగ్రత ను సమంగా ఉంచడానికి.. శరీరాన్ని బయటి సమస్యల నుంచి రక్షించడానికి తోడ్పడుతుంది చర్మం. మారుతున్న జీవన శైలి.. వాతావరణ కాలుష్యం.. ఇతర కారణాల వల్ల ఇటీవలి కాలంలో చర్మవ్యాధులు విజృంభిస్తున్నాయి.

పెరుగుతున్న చర్మవ్యాధులు: చర్మ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలామంది మొటిమలు, మచ్చలు, పులిపిర్లు, చర్మం నల్లబడడం, కమిలిపోవడం, పొడిబారి పొలుసులుగా రాలిపోవడం, చర్మంపై తీవ్రంగా పగుళ్లు వంటి సాధారణ సమస్యలకు తోడు సొరియాసిస్, బొల్లి, టినియా వర్సికలర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

కారణం: మారుతున్న జీవన శైలి, కాలుష్యం, జన్యుపరమైన సమస్యలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు, అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్‌కు గురికావడం వంటివి చర్మ సమస్యలు, వ్యాధులకు కారణమవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు.

కొత్త చర్మం: చర్మం మన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచి నిరంతరం రక్షిస్తుండే రక్షణ కవచం. మన శరీరంలో అతి పెద్ద అవయవం కూడా చర్మమే. ఇది జుట్టు, గోళ్లు, గ్రంథులు, నరాలగ్రహకాలతో కూడిన సమీకృత వ్యవస్థ. చర్మం పైపొరలో ఉండే కణజాలం ఎప్పటికప్పుడు కొత్తగా మారుతుంటుంది.

పనేంటి? : శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చర్మం కాపాడుతుంది. చర్మంలో కెరాటిన్, ఫైబ్రొస్ ప్రొటిన్, లిపిడ్స్, ఇతర ఖనిజాలు, రసాయనాలు ఉండటం వల్ల ఇది వాటర్ ప్రూఫ్‌లా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను, అదనంగా ఉండే లవణాలను చర్మం విసర్జిస్తుంది. రక్తం చర్మం ద్వారా ప్రవహించినప్పుడు చర్మంలోని గ్రంథులు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ: శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో చర్మానిదే కీలకపాత్ర. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటను ఎక్కువగా స్రవించడం ద్వారా చల్లబడేలా చేస్తుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు చెమటను నియంత్రించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా అరికడుతుంది.

రంగుకు కారణం: మెలానిన్, కెరోటిన్, హిమోగ్లోబిన్ కారణంగా చర్మానికి, వెంట్రుకలకు రంగు వస్తుంది. చర్మంలోని పైపొరలో మెలనిన్ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే.. చర్మం రంగు అంత నల్లగా ఉంటుంది. తక్కువగా ఉత్పత్తి అయితే చర్మం తెల్లగా ఉంటుంది. కొందరి చర్మంలో మెలనిన్, కెరోటిన్‌లు పూర్తిగా ఉత్పత్తి కావు. అందువల్ల వారి చర్మం, వెంట్రుకలు పూర్తి తెల్లగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితినే ఆల్బినిజం అంటారు.

గజ్జి : దీన్ని డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఇది వేళ్ల మధ్య, కాళ్లు, చేతుల మూలల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి. వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడాలి.

మచ్చలు : పరిమాణంలో తేడాలు, ఎరుపు, నలుపు, గోధుమ రంగులలో ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉన్న మచ్చలు క్రమేపీ పెద్దగా మారుతుండటం, అవి రంగు మారుతుండడం, నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏదైనా సమస్య తలెత్తుతున్నట్టు భావించాలి.

యుట్రికేరియా : చర్మం మీద ఎర్రటి గడ్డలుగా ఉంటాయి. మంట పుడుతుంది. బాగా దురద పుట్టిస్తాయి. ఇవి శరీరంలోని ఏ భాగంలోనైనా ఉంటాయి. చాలారోజుల వరకు అలానే ఉండిపోతాయి. ఆహారం వల్ల ఈ చర్మ వ్యాధి వస్తుంది. ఆహార విహారాల్లో మార్పుల వల్ల చికిత్స చేయడం సాధ్యమౌతుంది. స్కిన్ క్రీములు పెట్టుకుంటే సరిపోతుంది.

ఎగ్జిమియా : ఇది అంటువ్యాధి కాదు. చర్మం మంటగా ఉంటుంది. ఎర్రగా, ఎండిపోయి ఉంటుంది. దురద పుడుతుంది. ఒత్తిడి, అలర్జీలు, వాతావరణంలో మార్పుల వల్ల ఎగ్జిమియా వ్యాధి రావడానికి కారణమౌతున్నాయి.

షింగ్లెస్: ఈ వ్యాధి లక్షణాల్లో ఎర్ర మచ్చలు ఒకటి. ఇవి చాలా నొప్పి కూడా ఉంటాయి. దురద పుడుతుంది. మంట పుడుతుంది. కొన్ని కేసుల్లో ఈ చర్మ సమస్యలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ వ్యాధి కొన్నివారాల పాటు ఉండొచ్చు. ఒక్కోసారి సంవత్సరాల తరబడి ఉండిపోతుంది. యాంటీ వైరల్ క్రీములు, మందులు వాడితే ఉపశమనం పొందొచ్చు.

రొసాసియా: ముఖం మీద ఎర్రటి మచ్చలు, ముక్కు మీద ఎర్రటి దద్దుర్లు ఏర్పడితే రొసాసియా అని నిర్ధారించుకోవచ్చు. మొటిమల మాదిరిగానే ఉంటాయి కానీ మొటిమలు కావు ఇవి. చెంపలు, గధుమ, నుదుటి మీద ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

సెబొరిక్ డెర్మటైటిస్: పసుపు లేదా తెలుపు మచ్చలు ముఖం మీద కనబడతాయి. ప్రభావిత ప్రాంతమంతా ఎర్రగా మారుతుంది. దురద పుడుతుంది. జిడ్డు చర్మం ఉంటుంది. ఆహార మార్పులతో ఈ చర్మవ్యాధిని ఇట్టే నయం చేయవచ్చు.

కాంటాక్ట్ డెర్మటైటిస్: ఇది కూడా సాధారణంగా వచ్చే చర్మ వ్యాధి. ఎర్రగా, వాపుతో ఉండే వీటికి దురద వస్తుంటుంది. ఈ దద్దుర్లు 12 నుంచి 72 గంటలలోపు వస్తుంటాయి. ఏదేని పడని మొక్క లేదా చెట్టును తాకినప్పుడు ఇవి వస్తుంటాయి.
SORIASIS
సొరియాసిస్: చర్మం మీద తెల్లని పొలుసులు ఏర్పడతాయి. వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు వెంటనే వచ్చేస్తుంది. కొత్త కణాలు వెంట వెంటనే పుట్టుకురావడం వల్ల ఈ సమస్య వస్తుంది. పుర్రె, మోచేతులు, మోకాళ్లు, నడుము కింది ప్రాంతాలలో సొరియాసిస్ వస్తుంది. లైట్ ట్రీట్‌మెంట్ ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.

బొల్లి

bigstock
ఈ వ్యాధి సొకితే చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దానివల్ల చర్మం రంగు మారిపోతుంది. వ్యాధి సోకిన చోట చర్మం పూర్తి తెల్లగా.. మిగతా చోట్ల సాధారణ రంగులో ఉంటుంది. ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
bhumesh
తామర:చర్మంపై దురద ఏర్పడడంతో ఈ వ్యాధి మొదలౌతుంది. ఈ సూక్ష్మజీవులు నివసిస్తున్న చర్మం మీద చిన్న చిన్న ఎరుపు రంగు పొక్కులు, పుండ్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన దురద కలుగుతుంది. రాత్రివేళల్లో ఇది విపరీత స్థాయిలో ఉంటుంది.

317
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles