పైల్స్‌కు శాశ్వత చికిత్స


Wed,February 15, 2017 02:06 AM

పైల్స్, ఫిషర్, ఫిస్టూలా ఈ మూడు సమస్యలు మలద్వారం దాని చుట్టుపక్కల గల అవయవాలకు వచ్చే సమస్యలు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఈ మధ్య కాలంలో ప్రతి ఐదు మందిలో ఒక్కరికి మలద్వార సమ్యలు వస్తున్నాయి. ఇవి మొదటగా చాలా తక్కువ లక్షణాలు కలిగి ఉండి క్రమేణా వీటి తీవ్రత పెరిగి మానసికంగా, శారీరకంగానూ చాలా ఇబ్బందులకు కారణమవుతాయి. పైన పేర్కొన్న మూడు సమస్యలు రావడానికి గల ప్రధానమైన కారణం మలబద్ధకం. దీనివల్ల ఎక్కువగా ముక్కటం, మలబద్ధకం వల్ల విరేచనం త్వరగా కాదు. ఫలితంగా ఎక్కువగా ముక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల మలద్వారం, దాని పరిసర భాగాలు అన్ని కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. క్రమేపీ, అక్కడి భాగంలో నొప్పితో కూడిన వాపు రావడం రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల విరేచనంతో పాటు రక్తం పడడం జరుగుతుంది.
canstock

కారణాలు


-పైల్స్ - ఈ సమస్యను హెమరాయిడ్స్ అంటారు. మలద్వారం చుట్టూ ఉండే సిరల్లో వాపు రావడం వల్ల పైల్స్ వస్తాయి. ఈ సమస్య రావడానికి గల ముఖ్యకారణం ఆహారపు అలవాట్లలో మనం చేసే లోపాలు. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం సరిపడినంత ఉండాలి. పీచు పదార్థం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో మలపదార్థం గట్టిపడి మలబద్ధకానికి కారణం అవుతుంది. అందువల్ల ఒత్తిడి ఎక్కువై మలద్వారం చుట్టూ ఉండే సిరల్లో వాపు వస్తుంది.
-కారణాలు- మలబద్ధకం, అధికంగా ముక్కడం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, గర్భిణుల్లో, సిరోసిస్ లివర్.

లక్షణాలు


పైల్స్‌తో బాధపడే వారిలో సాధారణంగా నొప్పి, రక్తం పడడం, నొప్పి చాలా తీవ్రంగా ఉండడం, మల ద్వారం దగ్గర ఏదో అడ్డంకిగా ఉన్నట్టు అనిపించడం, చుక్కలుగా రక్తం పడడం.

ఆనల్ ఫీషర్


మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడాన్ని ఆనల్ ఫీషర్ అంటారు. దీనికి ప్రధానమైన కారణం మలబద్ధకం. ఆనల్ ఫీషర్‌లో కనబడే ప్రధానమైన లక్షణం తీవ్రమైన నొప్పి.

ఆనల్ ఫిస్టూలా


ఒక అసాధారమైన ద్వారం మలద్వారం భాగంలోని చర్మంలో ఏర్పడుతుంది. దీనికి కూడా ప్రధాన కారణం మలబద్ధకం. దీని వల్ల కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బాక్టీరియా ప్రవేశించి బయటకు తొలుస్తూ వస్తూ చర్మం వరకు ఓ అసాధారణమైన ద్వారాన్ని ఏర్పాటు చేస్తుంది. చర్మం పైన ఇది చీముతో కూడిన గడ్డలాగా కనిపిస్తుంది. దీన్ని చీముగడ్డ అని భావించి చికిత్స చేస్తే పైన చర్మం మీద ఉన్న గడ్డ నయం అవుతుంది. గాని లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉండడం వల్ల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఆనల్ ఫిస్టూలాలో కనబడే ప్రధాన లక్షణం మల విసర్జన సమయంలో నొప్పి కలగడం. మలద్వారం దగ్గర ఉండే చర్మం పైన ఏర్పడ్డ రంధ్రంలో చీముతో కూడిన రక్తం బయటకు రావడం జరుగుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
reddy

హోమియో చికిత్స


పైల్స్, ఫిషర్, ఫిస్టూలాకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు సమస్యలకు సాధారణంగా సర్జరీ వల్ల మనం కోరుకున్న ఫలితాలను పొందలేం. చాలా సందర్భాలలో సమస్య తిరగబెడుతుంది. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి హోమియో మందులు అద్భుతంగా పనిచేస్తాయి.
పైల్స్, ఫీషర్, ఫిస్టూలాకు హోమియోపతిలో బ్రయోనియా, నక్స్‌వామిక, ఏస్‌కులస్, ఏలోస్, రథానియా, అల్యూమినా, కొలిన్‌సోనియా వంటి చక్కటి మందులు కలవు. ఈ మందులను కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి మానసిక, శారీరక, వ్యాధి లక్షణాలను అనుసరించి వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా నిర్ణీత పద్ధతిలో మందులు వాడడం వల్ల ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

1466
Tags

More News

VIRAL NEWS