పైల్స్‌కి హోమియో చికిత్స


Wed,July 20, 2016 01:40 AM

పైల్స్ లేదా అర్శమొలలనే వైద్య పరిభాషలో హెమరాయిడ్స్‌గా పిలుస్తారు. నొప్పి, మంట, దురదతో సూదులు గుచ్చుకున్నట్టు ఉండే బాధతో ఒకచోట కూర్చోలేరు. నిల్చోలేరు. మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం కలుగుతుంది. దాంతో చాలావరకు హిమోగ్లోబిన్ శాతం తగ్గి వీళ్లకు ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వాహనాలు ఎక్కువ సేపు నడపడం, వేసవిలో, నీరు అధికంగా తీసుకోకపోవడం సమస్యకు కారణమవుతాయి. గర్భిణుల్లో, ప్రొస్టేట్ గ్రంథి వాపు ఉన్న పురుషుల్లో సాధారణంం. పిల్లలో ఇది చాలా అరుదు.

కారణాలేంటి?
మలబద్దకం వల్ల అతిగా ముక్కడం వల్ల
దీర్ఘకాలిక విరేచనాలు
గర్భస్థ పిండం ఒత్తిడి, అధికంగా ఉత్పత్తయ్యే హార్మోన్ల వల్ల
ప్రసవ సమయంలో శిశువు ఒత్తిడి మలద్వారంపై పడడం
పురుషుల్లో ప్రొస్టేట్ వాపు వల్ల మూత్ర విసర్జన సమయంలో పురీషనాళంపై ఒత్తిడి పెరగడం
పొత్తికడుపు లేదా పేగుల్లోని క్యాన్సర్ సంబంధ కణితులు
వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల్లోని వ్యక్తులకు మలనాళ సమీపంలోని సిరలు బలహీనంగా ఉండడం
అధిక బరువు, స్థూలకాయం
వేరికోస్ సిరల వ్యాధి ఉన్నవారిలో తరచు కనిపిస్తాయి.
ఆధునిక ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా పీచు లేని, తక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం
హెమరాయిడ్‌లు - రకాలు
మొదటి దశ : రెక్టమ్ లేదా పురీషనాళం లోపలనే ఉంటాయి. బయటకు కనిపించవు.
రెండవ దశ : మల నాళం గోడల వెలుపలికి చొచ్చుకుని వచ్చేవి. మలద్వారం తెరుచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి, అది మూసుకోగానే వెంటనే లోపలికి వెళ్లిపోతాయి.
మూడవ దశ : వెలుపలికి వచ్చిన హెమరాయిడ్‌లను లోపలికి చొప్పిస్తే మళ్లీ వెంటనే లోపలికి వెళ్లిపోతాయి.
నాల్గవ దశ : మలద్వారం వెలుపల శాశ్వతంగా వేలాడుతూ ఉంటాయి.

లక్షణాలు
చాలామందికి ఇంటర్నల్ పైల్స్‌లో ఎటువంటి లక్షణాలుండవు. మలద్వారం తెరుచుకొన్న వెంటనే మలద్వారం ద్వారా రక్తం వస్తుంది. దానిచుట్టూ దురద ఉండవచ్చు. మూడు, నాలుగు దశల్లోని హెమరాయిడ్స్ అధికంగా నొప్పి ఉండి, చీము వంటి పలుచని ద్రవం విసర్జన అవుతుంది. పైల్స్ కాని జబ్బుల్లో కూడా మలంలో రక్తం పడుతుంది కాబట్టి రక్తం కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నిర్ధారణ ఎలా?
రోగి చెప్పే వివరణలతో పాటుగా భౌతిక పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. బాహ్య హెమరాయిడ్‌లైతే పరీక్షించేటప్పుడు చేతివేళ్లకు రక్తం అంటుకుంటుంది. లోపలి హెమరాయిడ్‌లు భౌతిక పరీక్షలో తెలియనప్పటికీ ఆనల్ ఫిషర్ వంటి ఇతర వ్యాధులను గుర్తించవచ్చు. హెమరాయిడ్స్‌కి చికిత్స చేసేముందు వేరే వ్యాధులు లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం.

నివారించవచ్చా?
మొలలు వచ్చిన తరువాత కంటే వాటి లక్షణాలు కనబడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటిని నివారించవచ్చు. వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. తాజాపండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు, పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు. యోగా, వ్యాయామం మంచివి.

ఆధునిక వైద్యం ఎలా ఉంటుంది?
హెమరాయిడ్స్ అదుపులోకి రాకపోతే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కానే కాదు. మలబద్దకం వల్ల మళ్లీ మళ్లీ హెమరాయిడ్స్ వస్తుంటాయి.

హోమియో చికిత్స వల్ల ప్రయోజనం ఉంటుందా?
మొదటి మూడు దశలలోని హెమరాయిడ్స్‌ను పూర్తిగా నయం చేయడమే కాకుండా శస్త్రచికిత్స అవసరం లేకుండా చేస్తుంది. హెమరాయిడ్ వల్ల వచ్చే బలహీనతను తగ్గించి, శాశ్వతంగా రాకుండా చేస్తుంది. శారీరక, మానసిక, వ్యక్తిత్వ లక్షణాలతో మందుల ఎంపిక జరగడం వల్ల వంశపారంపర్యంగా వచ్చే బలహీనతను కూడా సరిచేస్తుంది.
హోమియోలో ఆస్‌కులస్ హిప్, ఆలోస్, హెమాములస్, కొలింగ్, సోనియ, ఆర్సనిక్ ఆల్, నక్స్‌వామికా మందులు బాగా పనిచేస్తాయి.
murali

1794
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles