పెరుగుతో ఆరోగ్యం


Wed,May 30, 2018 11:12 PM

ఒంటికి రక్షణ కల్పించడంలో పెరుగు కీలపాత్ర పోషిస్తుందనేది జగమెరిగిన సత్యం. శరీర ఆరోగ్యానికి, ముఖ సౌందర్యానికి, జుట్టుకు రక్షణ కల్పించడంలో పెరుగుకు సాటి లేదు. ఎన్నో పోషక విలువలు కలిగిన పెరుగు ప్రయోజనాలను ఈ వారం తెలుసుకుందాం.
curd
-పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
-పెరుగును భోజనంలో తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి.
-పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగుల లోపల సరఫరాను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఎర్రబడిన పేగులను నయం చేస్తుంది. కడుపులోపలి సమస్యలకు పెరుగు చక్కటి పరిష్కారం.
-పెరుగును నిత్యం తీసుకోవడం వల్ల చర్మంపై తేమ సహజంగా ఉంటుంది. చర్మం పొడిబారినప్పుడు పెరుగును తీసుకోవడం ఉత్తమం.
-పెరుగులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు, అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు గొప్పగా పనిచేస్తుంది.
-పెరుగును బరువు తగ్గేందుకు, పెరిగేందుకు రెండు విధాలుగా వాడుకోవచ్చు.
-రక్తంలోని కర్టిసోల్ స్థాయిని పెరుగు తగ్గిస్తుంది. అంతేకాకుండా బొడ్డు, గుండె చుట్టూ పేరుకుపోతున్న కొవ్వును కూడా తగ్గిస్తుంది.
-పెరుగును భోజనంలో తరుచూ తీసుకోవడం వల్ల జంక్‌ఫుడ్‌ను తినాలనే ఆలోచన కూడా తగ్గుతుంది.
-దంతాలకు, వాటి ఎముకలకు పెరుగు పోషణ ఇస్తుంది. పెరుగులోని కాల్షియం, ఫాస్ఫరస్ దంత సంరక్షణకు దోహదపడతాయి.
-చుండ్రును వదిలించుకోవడానికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చుండ్రును నివారిస్తుంది. పెరుగుతో ఇంట్లోనే సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు.
-హెన్నా, పెరుగును సముపాళ్లలో కలిపి జుట్టుకు పట్టించి, కొద్దినిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది.
-వ్యాయామం పూర్తైన తర్వాత పెరుగును తీసుకుంటే.. దానిలోని విటమిన్లు, ఖనిజాలు ఒంటికి తక్షణ శక్తిని అందిస్తాయి.
-తాజా పండ్లు, దానిమ్మ, గోధుమ, పొద్దుతిరుగుడు వంటి గింజలను పెరుగులో కలిపి తినడం వల్ల శరీరానికి అధిక పోషకాలు అందుతాయి. అనారోగ్యం దరిచేరదు.


mayuri-avula

2816
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles